పెద్ద గండం త‌ప్పించ‌మంటూ బాబును కోరిన మోడీ

పెద్ద గండం త‌ప్పించ‌మంటూ బాబును కోరిన మోడీ

ఏపీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు సామ‌ర్థ్యంపై ఉన్న న‌మ్మ‌కానికి ఇదో నిద‌ర్శ‌నం. సాక్షాత్తు ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ముందున్న అతి పెద్ద స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డే బాధ్య‌తను చంద్ర‌బాబుకు అప్ప‌గించారు. త‌న‌కు ప‌రువు స‌మ‌స్య‌గా మారిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా గెలుపు విష‌యంలో బాబు స‌హాయాన్ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ఎన్డీఏ ప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసిన తెలిసిందే. ఇదే విషయం చెప్ప‌డానికి బాబుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఫోన్ చేశారు. త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని బాబు ప్ర‌ధానికి హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తృణ‌మూల్ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. బీజేపీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిస్తామ‌ని మాట ఇవ్వ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో మ‌మ‌తా కూడా ఒక‌రు. పైగా మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఆమెకు కేంద్రంతో ప‌డ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యాన్ని మీరే చెప్పాలంటూ బాబును మోడీ కోరిన‌ట్లు తెలిసింది. మ‌మ‌త‌తో అంత మంచి సంబంధాలు లేక‌పోవ‌డంతో.. ఆమెతో ఎందుకొచ్చిన త‌ల‌నొప్ప‌ని మోడీ ఆ బాధ్య‌త‌ల‌ను బాబుకు అప్ప‌గించి ఆమెను ఒప్పించాల‌ని కోరారు.

మ‌రోవైపు చంద్ర‌బాబుకు అప్పగించిన ప‌ని అదంత సులువైన ప‌నిలా ఏమీ క‌నిపించ‌డం లేదు. దేశంలో ఎంద‌రో ద‌ళిత నేత‌లు ఉన్నార‌ని, ఆయ‌న గ‌తంలో బీజేపీ ద‌ళిత మోర్చాకు అధ్య‌క్షుడిగా ప‌నిచేయ‌డం వ‌ల్లే రామ్‌నాథ్‌ను ఎంపిక చేశార‌ని మ‌మ‌తా ఆల్రెడీ విమ‌ర్శించేశారు! మ‌రోవైపు ఎన్డీఏ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌గానే తృణ‌మూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రైన్ కూడా ఓ వెట‌కారంతో కూడిన ట్వీట్ చేశారు. `ఇవాళ వికీపీడియాను ఎంత‌మంది వెదికారు.. నేనైతో చూశాను` అంటూ బీజేపీకి పంచ్ ఇచ్చారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బాబు ఈ స‌మస్య‌ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి మ‌రి. కాగా, ప్ర‌స్తుతం మ‌మ‌తా బెన‌ర్జీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఆమె నెద‌ర్లాండ్స్ వెళ్లారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు