రజిని నుండి సంకేతాలు

రజిని నుండి సంకేతాలు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసేందుకు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా ర‌జ‌నీ రాజ‌కీయ‌రంగ‌ప్ర‌వేశం మీద జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే అభిమానుల‌ను ఐదు రోజుల పాటు క‌లిసి..వారితో ఫోటోలు దిగి.. తాను చెప్పాల‌నుకున్న మాట‌ల్ని వారికి చెప్ప‌టం ద్వారా.. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్న విష‌యాన్ని దేవుడి పేరుతో చెప్పేసి వైనం తెలిసిందే.
పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లుగా నేరుగా చెప్ప‌న‌ప్ప‌టికీ.. ఆ అర్థం వ‌చ్చేలా చేసి.. రాజ‌కీయ‌.. సినిమా రంగాల్లో సంచ‌ల‌నం సృష్టింట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారారు.

నాటి నుంచి ర‌జ‌నీ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం మీద చాలానే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌జ‌నీ ఒక ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఈ రోజు ఆయ‌న్ను రైతులు క‌లిశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన ర‌జ‌నీ.. వారికి రూ.కోటి సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని రైతుల స‌మ‌స్య‌ల విష‌యంలో స్పందించ‌ట‌మేకాదు.. వ్య‌క్తిగ‌తంగా కోటిరూపాయిల సాయం ప్ర‌క‌టించ‌టం ద్వారా.. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావటం ఖాయ‌మ‌న్న సంకేతాల్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న సాయం తో పాటు.. రానున్న రోజుల్లో మ‌రో ఆస‌క్తిక‌ర పిలుపును ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. రైతుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ర‌జ‌నీ పెద్ద కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు