త‌ల‌న‌రికేస్తాన‌న‌టంలో త‌ప్పేలేదంటున్న బాబా

త‌ల‌న‌రికేస్తాన‌న‌టంలో త‌ప్పేలేదంటున్న బాబా

యోగాస‌నాల ద్వారా ఎంత త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తారో...అంతే త‌ర‌చుగా వివాదాస్ప‌ద కామెంట్ల ద్వారా కూడా తెర‌మీద‌కు వ‌చ్చే  యోగా గురు బాబా రాందేవ్ త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను గ‌ట్టిగా స‌మర్థించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హర్యాణాలోని రోహతక్‌ జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న బాబా రాందేవ్‌ భారత్‌మాతాకీ జై అని నినాదం చేయని వాళ్ల తలను నరికేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించి గత బుధవారం రోహతక్‌ కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అంతకు రెండు రోజుల ముందు కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలంటూ బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చింది. అయితే, ఆయన కోర్టుకు హాజరకాకపోవడంతో బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చింది. దీనిపై ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి వారెంట్‌ రాలేదని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మీడియాపై సైతం చిర్రుబుర్రులాడారు.

`ఎవరైతే భారత్‌ మాతాకీ జై’ అనే నినాదాన్ని అనడానికి నిరాకరిస్తారో వారి తల నరికేస్తానంటూ తాను వ్యాఖ్యల్లో ఏం త‌ప్పు ఉంద‌ని రాందేవ్ బాబు ఎదురు ప్ర‌శ్నించారు. తానేం తప్పుగా అనలేదని, తల నరికేస్తాను అనడంలో తప్పు లేదని అన్నారు. తాను చట్టాన్ని నమ్ముతానని, ఈ విషయం ఇంతటితో ముగిసిందని స్వీయ తీర్పు ఇచ్చేశారు. ఇక తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమన్లు, వారెంట్‌లు రాలేదని, ఇలాంటి విషయాలు మీడియాకు ఎలా తెలుస్తాయో అర్థం కావడం లేదని చెప్పారు. దేశ‌భ‌క్తి విష‌యంలో వ‌క్రీక‌ర‌ణ‌లు స‌రికాద‌ని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు