రూ.2 కోట్ల గులాబీల‌తో కాస్ట్లీ వెడ్డింగ్‌!

రూ.2 కోట్ల గులాబీల‌తో కాస్ట్లీ వెడ్డింగ్‌!

పుర్రెకో బుద్ధి... జిహ్వ‌కో రుచి అన్నారు పెద్ద‌లు! త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు కొంద‌రు. అదే కోవ‌లో త‌న‌ కుమారుడి పెళ్ళి క‌ల‌కాలం గుర్తుండి పోవాల‌నుకుందో ధ‌న‌వంతురాలు. పెళ్లి జ‌రుగుతున్న త‌మ ప్యాలెస్‌ను ఏకంగా రూ.2 కోట్ల విలువైన తెల్ల గులాబీల‌తో అలంక‌రించి వార్త‌ల్లో నిలిచింది.  

ఫోలరున్షో అలకీజ అనే నైజీరియన్ శ్రీమంతురాలు త‌న కొడుకు పెళ్లిని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో జ‌రిపించింది. కేవ‌లం గులాబీ పూల కోస‌మే రెండు కోట్లు ఖర్చు చేసింది. ఇక పెళ్లి ఎంత గ్రాండ్‌గా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఈ పెళ్లి వేడుక కోసం త‌మ‌ బ్లెన్ హీమ్ ప్యాలెస్ ను తెల్లగులాబీలతో అలంకరించారు. పెళ్లికి వ‌చ్చిన‌ అతిథులను అల‌రించ‌డానికి రాబిన్ థికే అనే సింగర్ తో లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇప్పించారు. అత‌డికి  దాదాపు కోటీ ఇరవై లక్షల రూపాయల పారితోషికం చెల్లించార‌ట‌!

పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కట్ చేసిన 12 అడుగుల ఎత్తున్న ఎయిట్ టైర్ కేక్ కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖ‌ర్చు చేశారు. ఈ పెళ్లి మొత్తం ఖర్చు దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు అయింది.  ఫొలరిన్ (30) కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య క్యాన్సర్ తో చ‌నిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English