కాంగ్రెస్ నేతల భోజనం ఖరీదెంతో తెలుసా?

కాంగ్రెస్ నేతల భోజనం ఖరీదెంతో తెలుసా?

నాలుగేళ్ల కిందట 2013లో యూపీయే ప్రభుత్వం హయాంలో అప్పటి ప్లానింగ్ కమిషన్ ఓ మాట చెప్పింది. ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ.33... గ్రామాల్లో అయితే రూ.27.20 సంపాదిస్తే బతకడానికి చాలని చెప్పింది.. అంతకంటే తక్కువ సంపాదించేవారు మాత్రమే పేదవారని సూత్రీకరించింది. యూపీఏ ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసిన ఈ లెక్క విపక్షాలు ఏకిపడేశాయి. 33 రూపాయలతో మనిషనేవాడు బతకగలడా లేదా అన్నది మనందరికీ తెలిసిందే.

ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న కర్ణాటకలో అదే పార్టీకి చెందిన మంత్రి ఒకరు రోజుకు రూ.4,700  భోజనం ఖర్చు చూపించారు. 33 రూపాయలంటే రోజు గడిచిపోతుందని చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేస్తున్నవారు ఉన్నారు. లేదంటే ఈ నాలుగేళ్లో భోజనం ఖర్చు 150 రెట్లు పెరిగిందో ఏమో..? అనుకోవాలి మరి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే... గత ఏడాది బెళగావిలో శీతాకాల కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పాటు జరిగాయి. ఆ పది రోజుల్లో చట్టసభల్లో వివిధ విషయాల పై చర్చ జరిగింది కేవలం 55 గంటలు మాత్రమే. అయితే అసెంబ్లీకి హాజరైన వారికి స్థానిక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో 53 గదులను అద్దెకు తీసుకున్నారు. ఇందుకు రూ.57,99,375లను చెల్లించారు. ఇక ప్రజాప్రతినిధుల తిండి ఖర్చులు చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఆ రాష్ర్ట న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర ఏకంగా పది రోజుల భోజన ఖర్చులు రూ.47,033 గా చూపించారు. అంటే రోజుకు రూ.4,700 ఆయన భోజ‌నానికే ఖ‌ర్చ‌యింద‌న్న‌మాట‌.

జేడీయూ నేత కుమారస్వామి ఒక రోజు రాత్రి భోజనం కోసం రూ.3,352 ఖర్చు చూపించగా ఐవాన్‌ డిసౌజ రూ.3,105లను ఖర్చుచేశారు. బీజేపీ పక్ష నేత జగదీశ్‌ శెట్టర్‌ ఒక్కరే అందరి కంటే తక్కువగా రోజుకు రూ.50లతో  భోజనం చేశారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు