ఆ ఊరి పేరు డొనాల్డ్ ట్రంప్‌

ఆ ఊరి పేరు డొనాల్డ్ ట్రంప్‌

లోక‌ల్ సెంటిమెంట్‌తో త‌మ ఉద్యోగాల‌కు ఎస‌రు పెడుతున్న ట్రంప్ పేరు చెబితే అమెరికాలోని భార‌త సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హ‌డ‌లెత్తుతున్నారు. ఆయ‌న పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. మ‌రోవైపు, భార‌త్‌లోని ఓ గ్రామానికి ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్ట‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ‌ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాతక్ తెలిపారు.

భార‌త్‌, అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా భార‌త్‌లోని ఓ గ్రామానికి ట్రంప్ పేరు పెట్ట‌బోతున్నట్లు తెలిపారు. వాషింగ్టన్ లో ఓ కమ్యూనిటీ ఈవెంట్ సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ట్రంప్ పేరు పెట్ట‌బోతున్నఆ గ్రామం రాజస్థాన్ లోని మేవాట్ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం ఆ గ్రామం అభివృద్ధి దశలో ఉంద‌ని పాత‌క్‌ చెప్పారు. స్వచ్ఛ భారత్ కోసం సుల‌భ్ సంస్థ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English