అనుష్కకు ఆ మాట చెప్పి కోహ్లీ క‌న్నీరు కార్చేశాడ‌ట‌

అనుష్కకు ఆ మాట చెప్పి కోహ్లీ క‌న్నీరు కార్చేశాడ‌ట‌

బ్యాట్ ప‌ట్టుకొని క్రీజ్ లోకి వ‌చ్చేస్తే..బంతి వేసేవాడు ఎవ‌ర‌న్న‌ది చూడ‌కుండా బాదేసే మొన‌గాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రీజ్ లో ఉన్న‌ప్పుడు చెల‌రేగిపోయే ఇత‌గాడి విధ్వంస బ్యాటింగ్ అంటే కోట్లాది మంది భార‌తీయుల‌కే కాదు.. ప‌లు దేశాల్లో అత‌గాడికి భారీగా అభిమానులు ఉన్నారు. క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా సున్నిత భావాలున్న వ్య‌క్తిగా కోహ్లీ క‌నిపిస్తారు.

అత‌డెంత సెన్సిటివ్ అన్న విష‌యాన్ని రుజువు చేసేలా తాజాగా ఒక ఉదంతాన్ని చెప్పుకొచ్చారు కోహ్లీ. త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌తో తాను షేర్‌ చేసుకున్న ఒక గుడ్ న్యూస్ ను చెప్పుకొచ్చిన అత‌డు.. ఆ సంద‌ర్భంగా తానేం చేశానో చెప్పుకొచ్చారు.

టెస్ట్ సిరీస్ లో భాగంగా తాను మొహాలీలో ఉన్నాన‌ని.. త‌న‌ను క‌లిసేందుకు అనుష్క‌ అక్క‌డికి వ‌చ్చింద‌ని.. నిజంగానే ఆమె త‌న‌కు క‌లిసి వ‌చ్చింద‌న్నాడు కోహ్లీ. ఆమె త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాక‌.. తాను కెప్టెన్ అయ్యాన‌ని గుర్తు చేసుకున్నాడు. త‌న‌ను కెప్టెన్ గా ఎంపిక చేశార‌న్న విష‌యాన్ని అనుష్క‌కు ఫోన్ చేసి చెప్పాన‌ని.. ఆ సంద‌ర్భంగా భావోద్వేగాన్ని ఆపుకోలేక తాను ఏడ్చేసిన‌ట్లుగా విరాట్ చెప్పాడు.

అలాంటి రోజు వ‌స్తుంద‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని.. ఆశ్చ‌ర్య‌క‌రంగా తాను టెస్ట్ కెప్టెన్ గా ఆడిన తొలి టెస్ట్ మెల్ బోర్న్ లో జ‌రిగితే.. అప్పుడు కూడా అనుష్క త‌న ప‌క్క‌నే ఉంద‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి అనుష్క త‌న‌కెంత ల‌క్కీనో అన్న విష‌యాన్ని ఓపెన్ గా చెప్పేసి.. గ‌ర్ల్ ఫ్రెండ్ మ‌న‌సును దోచేస్తున్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు