ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడ‌ని మ‌ర‌ణ‌శిక్ష విధించారు

ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడ‌ని మ‌ర‌ణ‌శిక్ష విధించారు

ఫేస్ బుక్ లో పోస్ట్ పెడితే అయితే కేసు పెట్ట‌టం.. జైలుశిక్ష విధించ‌టం చూశాం. కానీ.. ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ పై పాక్ న్యాయ‌స్థానం ఒక‌టి మ‌ర‌ణ‌శిక్ష విధించ‌టం సంచ‌ల‌నంగా మారింది. దేవుడ్ని దూషించిన స‌మాచారాన్ని ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిందుకు ఒక వ్య‌క్తికి మ‌ర‌ణ‌శిక్ష విధించారు.

లాహోర్‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో ఒకారా ప్రాంతానికి చెందిన తైమూర్ ర‌జా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. దేవుడ్ని దూషిస్తూ ఉండేలా పోస్ట్ ఉంది. ఇలాంటి స‌మాచారంతో ఫేస్‌బుక్ లో చేస్తున్న ప్ర‌చారంపై తైమూర్ తో క‌లిసి ప‌ని చేసే ఉద్యోగి ఒక‌రు ఫిర్యాదు చేశారు.

దీంతో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిపై కేసు పెట్టిన పోలీసులు.. ఈ కేసును పంజాబ్ ప్రావిన్స్ లోని బాహ‌వాల్ పూర్ ఉగ్ర‌వాద నిరోధ‌క న్యాయ‌స్థానంలో విచార‌ణ చేశారు. అభ్యంత‌ర‌క‌ర స‌మాచారం ఉంచ‌టం.. దేవుడ్ని దూషించిన ఉందంపై అత‌నిపై చేసిన ఆరోప‌ణ‌ల్ని నిజ‌మ‌ని తేల్చింది న్యాయ‌స్థానం. అత‌డు చేసిన త‌ప్పున‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్‌కి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించ‌టం పాకిస్థాన్‌లో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ప్రాణాలు తీయ‌ట‌మో.. దారుణ నేరాల‌కు పాల్ప‌డ‌ట‌మో లాంటివి లేకున్నా.. ఫేస్ బుక్ లో పోస్ట్ కూడా మ‌ర‌ణ‌శిక్షకు కార‌ణంగా మారుతుంద‌న్న‌ది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు