పిల‌వ‌ని పెళ్లికి వెళ్లి ర‌చ్చ చేసిన ట్రంప్‌

పిల‌వ‌ని పెళ్లికి వెళ్లి ర‌చ్చ చేసిన ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్న‌మైన మ‌న‌స్త‌త్వానికి ఇదో నిద‌ర్శ‌నం.! త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించే ట్రంప్  ఏది చేసినా సెన్సేషనే. వీకెండ్ కు గోల్ఫ్ క్ల‌బ్ లో ఎంజాయ్ చేద్దామ‌నుకున్న ట్రంప్ ఓ విచిత్ర నిర్ణ‌యం తీసుకున్నారు. గోల్ఫ్ క్ల‌బ్ కు దగ్గ‌ర్లో జ‌రిగే ఓ వెడ్డింగ్ రిసెప్ష‌న్ కు వెళ్లాల‌నుకున్నారు. అనుకున్న‌దే త‌డువుగా.. స‌డెన్ గా వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో.. పెళ్లి కి వ‌చ్చిన గెస్టుల‌తో స‌హా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. అంతా ఒక్క‌సారిగా షాకయ్యారు.

సాక్షాత్తు అమెరికా అధ్య‌క్షుడు త‌న వివాహ‌విందుకు హాజ‌రుకావ‌డంతో.....పెళ్లి కూతురు ట్రంప్ ద‌గ్గ‌రికి ప‌రిగెత్తుకు వ‌చ్చి కౌగిలించుకొని ఓ ముద్దిచ్చింది. వెంట‌నే ట్రంప్ పెళ్లి కూతురుతో క‌లిసి ఫోటోల‌కు పోజిచ్చారు. త‌ర్వాత‌.. పెళ్లి కొడుకు, పెళ్లి కూత‌రు పేర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటూ చెప్పి అక్క‌డున్న వాళ్ల‌కు చేతులూపి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆయ‌న ఉన్న‌ది కొంచెం సేపే అయినా.. ట్రంప్ ఉన్నంత సేపు రిసెప్ష‌న్ కు వ‌చ్చిన వాళ్లంతా.. యూఎస్ఏ.. యూఎస్ఏ.. అంటూ అరిచారు. ట్రంప్ ఇలా సడెన్ గా వెడ్డింగ్ రిసెప్ష‌న్ల‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారేమీ కాదు. ఈ ఫిబ్ర‌వ‌రిలో కూడా ఇలాగే ఓ పెళ్లి రిసెప్ష‌న్ కు వెళ్లి అంద‌రినీ  ట్రంప్ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఇదిలాఉండ‌గా...అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్‌.. మొత్తానికి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన‌ ఆరు నెల‌ల త‌ర్వాత ఆమె అధ్య‌క్ష భ‌వ‌నానికి వ‌చ్చారు. 11 ఏళ్ల బార‌న్ ట్రంప్‌తో క‌లిసి ఆమె వాషింగ్ట‌న్ వ‌చ్చారు. ఇన్నాళ్లూ ఆమె న్యూయార్క్‌లోనే ఉన్నారు. బార‌న్ అక‌డ‌మిక్ ఇయ‌ర్ పూర్తి చేయాల‌న్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వాషింగ్ట‌న్ వ‌చ్చేసినా.. ఆమె మాత్రం న్యూయార్క్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు బార‌న్‌.. వాషింగ్ట‌న్ స‌మీపంలోని సెయింట్ ఆండ్రూస్ ఎపిస్కోప‌ల్ స్కూల్‌కు వెళ్ల‌నున్నాడు. వైట్‌హౌజ్‌కి వ‌చ్చిన త‌ర్వాత మెలానియా సౌత్ లాన్‌, వాషింగ్ట‌న్ మాన్యుమెంట్‌ల‌ను చూస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. అధ్య‌క్షుడితోపాటు కాకుండా వైట్‌హౌజ్‌కు ఆల‌స్యంగా వ‌చ్చిన తొలి ఫ‌స్ట్‌లేడీ మెలానియానే. ట్రంప్ అధ్యక్షుడైన‌ప్ప‌టి నుంచీ కూడా మెలానియా కాస్త దూరంగానే ఉన్నారు. తొలిసారి విదేశీ ప‌ర్య‌టన‌కు ట్రంప్ వెళ్లిన‌పుడే ఆయ‌న‌తోపాటు మెలానియా వార్త‌ల్లో నిలిచారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు