రూ.60 వేల నోట్లను మేసిన మేక

రూ.60 వేల నోట్లను మేసిన మేక

ఆకలేస్తే పచ్చ‌టి ఆకుల‌ను తినే మేక‌లను గురించి విన్నాం. ఆక‌లికి తట్టుకోలేక ఏకంగా రూ.60వేల విలువైన ప‌చ్చ‌ నోట్లను నమిలేసిందో మేక. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వింత ఘ‌ట‌న జ‌రిగింది. యూపీలోని కన్నౌజ్‌ జిల్లాకి చెందిన సర్వేశ్‌ కుమార్ అనే క‌న్‌స్ట్ర‌క్ష‌న్  వ్యాపారి ఓ మేకని పెంచుకుంటున్నాడు.

ఇటుకలు కొనడానికి అవ‌స‌రమైన‌ రూ.60 వేలు చొక్కా జేబులో ఉంచి స్నానానికి వెళ్లాడు.  అత‌డు తిరిగి వచ్చేస‌రికి ఆక‌లితో ఉన్న త‌న పెంపుడు మేక ఆ నోట్ల‌ను ఆర‌గించింది. చివ‌రికి స‌గం చినిగిపోయిన రూ.2000 నోటు మాత్ర‌మే మిగిలింది.

అయిన‌ప్ప‌టికీ  మేకపై తనకు ఎలాంటి కోపం లేదంటున్నాడు సర్వేశ్‌. పైగా ఆ మేక‌ని ప్రాణ‌ప్ర‌దంగా పెంచుకుంటున్నానని చెబుతున్నాడు. ఈ విషయం తెలిసిన జ‌నాలు ఆ మేక‌ను చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్నారట. అంతేకాదు, ఆ మేక‌తో ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతున్నార‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు సర్వేశ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు