జగన్ కు జాతీయ నేతల వార్నింగ్

జగన్ కు జాతీయ నేతల వార్నింగ్

ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెబుతూనే మోదీ ముందు సాగిలపడుతున్న వైసీపీ అధినేత జగన్ తీరును జాతీయ స్థాయి నేతలు తప్పుపట్టారు. గుంటూరులో నిన్న కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక హోదా బహిరంగ సభకు వచ్చిన జేడీయూ నేత శరద్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తదితరులు జగన్ చిత్తశుద్ధిని ప్రశ్నించారు.  

రాష్ర్టపతి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నావని ప్రశ్నించారు.  జగన్ ను మోడీ ఏమీ వదిలిపెట్టరని... కేవలం రాష్ర్టపతి ఎన్నికల వరకే ఈ పొత్తని... అవసరం తీరిపోయాక జగన్ ను మోదీ వదిలిపెట్టబోరని ఆయన హెచ్చరించారు.

రాష్ర్టపతి ఎన్నికల్లో అవసరాల కోసమే ప్రధాని మోడీ జగన్ ను చేరదీస్తున్నారని శరద్ యాదవ్ అన్నారు. ఆ ఎన్నికల తరువాత జగన్ పని  పడతారని అన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా జగన్, చంద్రబాబులు రాష్ర్టపతి ఎన్నికల్లో మోడీకి మద్దతివ్వడం మానుకోవాలని ఆయన సూచించారు.

మరోనేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇదే మంచి ఛాన్సని.. రాష్ర్టపతి ఎన్నికల్లో మద్దతు కావాలంటే హోదా ఇవ్వాలంటూ జగన్, చంద్రబాబులు మోడీకి మెలిక పెట్టాలని అన్నారు.

సురవరం సుధాకరరెడ్డి మాత్రం జగన్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలో దళితులపై బీజేపీ అకృత్యాలకు పాల్పడుతోందని... అలాంటి పార్టీకి జగన్ మద్దతివ్వడం కరెక్టు కాదని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు