కొణతాల సర్దుకుపోలేదా?

కొణతాల సర్దుకుపోలేదా?

దాడి వీరభద్రరావు చేరికను అస్సలు సహించలేకపోతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత కొణతాల రామకృష్ణ పార్టీ పట్ల ఇంకా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తున్నది. పార్టీ కీలక సమావేశాలకు కొణతాల డుమ్మా కొడుతున్నారు. ఇలా డుమ్మా కొట్టడం ఈ నాలుగైదు రోజుల్లోనే ఇది రెండోసారి.

పార్టీ పటిష్టత కోసం ఈ రోజు జరిగిన కీలక సమావేశానికి కొణతాల హాజరు కాలేదు. దానిపై కొన్ని ఊహాగానాలు రాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ వివరణ ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది. అందరూ అన్ని సమావేశాలకూ రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కాని 'దాడి' చేరికతోనే కొణతాలలో మార్పు వచ్చిందని, ఆ మార్పు అలాగే వున్నదని అధిష్టానం గనుక దాడికి ప్రాధాన్యత పెంచితే తాను పక్కకు తప్పుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నారనీ సమాచారమ్‌.

'దాడి'తో వేదిక పంచుకోలేను అని ఇప్పటికే కొణతాల చెప్పి ఉన్నారు. జగన్‌ చెప్పినట్లే వింటాను అని చెపుతూనే, కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి కదా.. అన్న కొణతాల, 'కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు' అని బాంబు పేల్చితేనో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English