ఏపీకి మ‌రో కిక్కు.. 100 ఇ-బైక్స్ ఇన్ వైజాగ్‌

ఏపీకి మ‌రో కిక్కు.. 100 ఇ-బైక్స్ ఇన్ వైజాగ్‌

భారత దేశంలోనే తొలిసారిగా ఎలక్ర్టిక్ ద్విచక్రవాహనాల రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసిన నగరంగా విశాఖపట్నం రికార్డు స్థాపించింది. విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు 100 లిమిట్ లెస్ ఎలక్ర్టిక్ టూ వీలర్స్ ను ప్రారంభించారు.
  
వీటిని శానిటరీ సూపర్ వైజర్స్ కు అందజేశారు. కర్బన ఉద్గారాలు లేని, పొల్యూషన్ ఫ్రీగా తక్కువ ఖర్చుతో నడిచే వీటిపై తిరుగుతూ పర్యవేక్షణ సాగిస్తారు.  ఈ వాహనాలను గయామ్ మోటార్ వర్క్స్ అనే స్టార్టప్ రాష్ర్ట ప్రభుత్వానికి సరఫరా చేసింది.
  
అధిక సామర్థ్యమున్న బ్యాటరీ.. స్మార్టు పెడల్ అసిస్ట్ సిస్టమ్ వంటివాటితో ఇవి ఆకట్టుకుంటున్నాయి. దీని బ్యాటరీని కేవలం 2.5 గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేయొచ్చు. ఈ వాహనాలు కేవలం 5 సెకన్లలోనే 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. మామూలుగా అయితే.. ద్విచక్రవాహనాలకు కిలోమీటరుకు రూ.2 వరకు ఖర్చవుతుంది.

కానీ... ఇవి కేవలం 7 పైసల ఖర్చుతో కిలోమీటరు దూరం ప్రయాణించే అవకాశం కల్పిస్తాయి. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జి చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించేది ఒకటి కాగా రెండో వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు