లైవ్ లో యాంకర్ ను ముద్దాడి..

లైవ్ లో యాంకర్ ను ముద్దాడి..

అంతర్జాతీయ స్థాయిలో ఆడుడూ కూడా కొన్నిసార్లు అదుపు తప్పుతుంటారు క్రీడాకారులు. గతంలో స్పెయిన్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గా ఉన్న కాసిలాస్ 2010 సాకర్ ప్రపంచకప్ సందర్భంగా లైవ్ లో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని ముద్దాడటం గుర్తుండే ఉంటుంది.

ఐతే అతను కిస్ చేసిన అమ్మాయి అతడి ప్రేయసే కావడంతో ఇబ్బంది లేకపోయింది. ఇక రెండేళ్ల కిందట క్రికెటర్ క్రిస్ గేల్.. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ యాంకర్ తో అసభ్యంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. తాజాగా ఓ టెన్నిస్ ఆటగాడు టీవీ యాంకర్ తో తేడాగా ప్రభవర్తించి టోర్నీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.

ఆ ఆటగాడి పేరు.. మాక్సిమ్‌ హమౌ. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో హమౌ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. ఐతే ఆ మ్యాచ్ తర్వాత మేలీ థామస్ అనే లేడీ యాంకర్ అతడిని ఇంటర్వ్యూ చేసింది. అది లైవ్ అవుతున్న సంగతి కూడా పట్టించుకోకుండా మాక్సిమ్.. ఆమె మీద చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకటికి రెండుసార్లు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా అతను వదల్లేదు. చేత్తో భుజం మీది నుంచి కిందికి తడిమే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో చూడగానే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు మండిపడ్డారు. అతడి అక్రిడిటేషన్ రద్దు చేస్తూ.. టోర్నీ పరిసరాల్లో ఉండకుండా నిషేధం విధించారు. అది లైవ్ కాబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే హమౌ చెంపచెల్లుమనిపించేదాన్నని ఆ యాంకర్ తర్వాత చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English