పవన్‌ సేన మరీ ఇంత వీకా?

పవన్‌ సేన మరీ ఇంత వీకా?

పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ హ్యాక్‌కి గురయి ఇరవై రోజులవుతోంది. ఇరవై రోజులుగా ట్వీట్‌ చేయని పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికీ ట్విట్టర్‌కి దూరంగానే వున్నాడు. హ్యాక్‌ అయిందో లేక ఏదైనా టెక్నికల్‌ ఇబ్బంది ఎదురైందో అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అకౌంట్‌ హ్యాక్‌ అయిందని, ఏవైనా ఇబ్బందికర ట్వీట్స్‌ పోస్ట్‌ అయితే తమకి సంబంధం లేదని మాత్రం చెప్పేసి ఊరుకున్నారు.

చిన్నా చితకా అకౌంట్స్‌కి ఇబ్బంది ఎదురైతేనే రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమైపోతుంది. అలాంటిది అంత పెద్ద స్టార్‌ అయి వుండీ పవన్‌కళ్యాణ్‌ ఇంతవరకు తన సమస్యకి పరిష్కారం కనుక్కోలేకపోయాడు. సాంకేతికంగా పవన్‌ టీమ్‌ ఎంత వీక్‌ అనే దానికి ఇది నిదర్శనమని, చిన్న విషయాన్ని సైతం సాల్వ్‌ చేసుకోలేక తమ నాయకుడిని బలహీనుడిగా చూపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ట్విట్టర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌, ఇతర లాగిన్‌ డీటెయిల్స్‌ పవన్‌కి కానీ, అతనితో వున్న వారికి కానీ తెలియవని, అది ఇన్నాళ్లు మెయింటైన్‌ చేసిన వ్యక్తి పరారీలో వున్నాడని, అందుకే ట్విట్టర్‌ ద్వారా కూడా అకౌంట్‌ స్వాధీనం చేసుకోలేకపోతున్నారని వినిపిస్తోంది. రాజకీయాలకి ప్రత్యక్షంగా దూరంగా వున్నా కానీ ఇంతకాలం ట్విట్టర్‌తోనే పవన్‌ తన గళం వినిపించాడు. ఇప్పుడు అదీ మూగబోవడంతో మూడు వారాలుగా జనసేన గొంతు మూగబోయింది. ఇంకా ఈ మౌనం ఎన్నాళ్లో, దీనికి ఎప్పటికి పరిష్కారం దక్కుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు