హైద‌రాబాదీయుల శృంగారంలో బ‌య‌ట‌కొచ్చిన కొత్త కోణం

హైద‌రాబాదీయుల శృంగారంలో బ‌య‌ట‌కొచ్చిన కొత్త కోణం

ఒక అడ‌ల్ట్ యాప్ స‌రికొత్త స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించింది. ప్ర‌పంచంలో శృంగారాన్ని అస్వాదించే టాప్ 100 న‌గ‌రాల వివ‌రాల్ని వెల్ల‌డించ‌ట‌మే కాదు.. ఆయా న‌గ‌రజీవుల సెక్స్ సంగ‌తుల్ని వెల్ల‌డించింది. ఆస‌క్తిక‌ర‌మైన ఈ శృంగార స‌ర్వేకు సంబంధించి వివ‌రాల్లో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌పంచంలో టాప్ 100 శృంగార న‌గ‌రాల్లో మ‌న దేశానికి చెందిన ఐదు న‌గ‌రాలు స్థానం సంపాదించాయి. ఇందులో హైద‌రాబాద్ ఒక‌టి కావ‌టం విశేషం.

ప్ర‌పంచంలో అత్యంత శృంగార న‌గ‌రంగా మొద‌టి స్థానాన్ని పారిస్ ద‌క్కించుకుంది. త‌ర్వాతి స్థానాల్లో రియో డిజెనిరో.. లండ‌న్‌.. లాస్ ఎంజెలిస్‌.. బెర్లిస్‌.. న్యూయార్క్ సిటీ.. సావోపాలో (బ్రెజిల్‌).. లాస్‌వెగాస్‌.. లెబిజా (స్పెయిన్‌).. అమ్‌స్ట‌ర్ డామ్ నిలిచాయి. ఇక‌.. మ‌న దేశానికి చెందిన ఐదు న‌గ‌రాల విష‌యానికి వ‌స్తే మొద‌టి స్థానంలో ముంబ‌యి (వ‌ర‌ల్డ్ 71 ర్యాంకు).. రెండో స్థానంలో ఢిల్లీ (78 ర్యాంకు).. మూడోస్థానంలో హైద‌రాబాద్ (89 ర్యాంకు).. నాలుగో స్థానంలో కోల్ క‌తా (90 ర్యాంకు).. ఐదో స్థానంలో చెన్నై (91 ర్యాంకు) ద‌క్కించుకున్నాయి.

ఇక‌.. శృంగార అంశాల‌కు సంబంధించి ఈ సర్వే స్పృశించిన అంశాలు చూస్తే.. శృంగారంలో పాల్గొన‌టం.. అందులో ప్ర‌యోగాలు చేయ‌టం.. సంతృప్తి.. సెక్స్ టాయిస్ వినియోగంతో పాటు.. సెక్స్ కంటెంట్ ను చూసే ధోర‌ణులు.. భాగ‌స్వామిని ఇత‌రుల‌తో పంచుకోవ‌టం.. స్వ‌లింగ సంప‌ర్కంపై ఆస‌క్తి లాంటి ప‌లు అంశాల మీద ఫోక‌స్ చేసింది.  ఆ వివ‌రాలు చూస్తే..

+ శృంగార కార్య‌క‌లాపాలు.. ప్ర‌యోగాల్లో రియో ఫుల్ మార్కులు వ‌చ్చేసినా.. సెక్స్ లో స్త్రీ..పురుష స‌మానం విష‌యంలో వెనుక‌ప‌డి పోవ‌టంతో పారిస్ త‌ర్వాతి స్థానంలో నిల‌వాల్సి వ‌చ్చింది. పోర్న్ వినియోగంలోనూ.. శృంగార వినోదంలోనూ లాస్ వెగాస్ కు టాప్ ర్యాంకు ల‌భించింది. ఉత్త‌ర అమెరికాకు చెందిన మ‌రో నాలుగు న‌గ‌రాలు పోర్న్ వినియోగంలో అగ్ర‌స్థానంలో నిలిచాయి.

+ భాగ‌స్వామిని పంచుకోవ‌టంలో బెర్లిన్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా.. హోంసెక్స్ విష‌యంలో లండ‌న్ కు టాప్ ర్యాంకు వ‌చ్చింది. బెల్జియంలోని ఎంట్ వెర్స్‌.. బ్ర‌సెల్స్ న‌గ‌ర ప్ర‌జ‌లు శృంగారాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తార‌ని తేల్చారు.

+ శృంగారంలో ఆస‌క్తిగా పాల్గొనే విష‌యంలో భార‌త్‌లో ఎంపికైన ఐదు న‌గ‌రాల విషయానికి వ‌స్తే.. ముంబ‌యి మొద‌టి స్థానంలో నిలిచింది. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ చివ‌రిస్థానంలో నిలిచింది. మ‌రోఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. శృంగారంలో పాల్గొనే విష‌యంలో వెనుక‌బ‌డి ఉన్న హైద‌రాబాద్‌.. పోర్న్ చూడ్డంలో మాత్రం టాప్ ప్లేస్ లో ఉన్నార‌ని తేల్చింది. శృంగారంలో ఆస‌క్తిగా పాల్గొన‌క‌పోయినా.. అలా చేసేట‌ప్పుడు మాత్రం సంతృప్తి పొంద‌టంలో బాగా ముందుంటార‌ని తేల్చారు.

+ సెక్స్ టాయిస్ వినియోగంలో ఢిల్లీ టాప్ లో ఉండ‌గా..హైద‌రాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. పోర్న్ కోసం నెట్ వెతికేట‌ప్పుడు ముంబ‌యి వాసులు బాబీ అన్న ప‌దంతో వెతికితే.. ఢిల్లీ వారు వైఫ్ అన్న ప‌దంతో.. హైదరాబాదీయులు కాలేజ్ గ‌ర్ల్స్ అని కోల్ క‌తా వాసులు బెంగాలీ అని.. చెన్నై వాసులు త‌మిళ్ అన్న ప‌దాల‌తో ఎక్కువ‌గా సెర్చ్ చేస్తుంటార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు