పవన్ కు రాయలసీమలో నో ఎంట్రీ

పవన్ కు రాయలసీమలో నో ఎంట్రీ

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాయలసీమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎన్నికలు ఇంకా రాకముందే పవన్ పై అక్కడి నేతలు ఫైర్ అవుతున్నారు. రాయలసీమలో ఆయన్ను అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నారు.
   
పవన్‌కల్యాణ్‌ రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని... తన ఉనికి చాటుకునేందుకు అప్పుడప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారని  రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. పవన్ రాయలసీమ నుంచి పోటీ చేస్తానని అంటున్నారని... అసలు రాయలసీమలో ఆయనకేం పని?  కోస్తాంధ్రలో పోటీ చేసుకోనివ్వండి, అంతేకానీ రాయలసీమ వైపు చూడొద్దు అన్నారు. అంతేకాదు.. రాయలసీమలో పవన్ ను అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.
   
పవన్ తన సోదరుడు చిరంజీవి మాదిరిగానే పార్టీ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం విడిపోయాక అన్నీ విజయవాడలో ఏర్పాటు చేస్తే రాయలసీమ గతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11 జిల్లాలతో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశామని ఆయన వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు