'చిరు' మంత్రికి తెలిసిపోయిందా?

'చిరు' మంత్రికి తెలిసిపోయిందా?

కాంగ్రెసు పార్టీలో 'చిరు' మంత్రి.. అనగా చిరంజీవి సన్నిహితుడైనటువంటి మంత్రి రామచంద్రయ్యగారికి పదవీ గండం పొంచి వున్నదంట. చిరంజీవి దయ వల్లనే మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు చిరంజీవి జపం చేయడంతోపాటుగా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిగారి జపమూ చేస్తూ తెలివిగా వ్యవహరిస్తున్నారు.

రామచంద్రయ్యగారేమో చిరంజీవి జపం చేయడం, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకించడం వల్ల అధిష్టానం దృష్టిలోనూ మైనస్‌ మార్కులు వేయించుకుంటున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మంత్రులపైన అధిష్టానానికి రిపోర్టు ఇచ్చిన కిరణ్‌, లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌ రామచంద్రయ్యకు ఇచ్చారంట.

అది తెలుసుకున్న రామచంద్రయ్య తన పదవి ఊడవచ్చుననే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారమ్‌ అందుతున్నది. కాని చిరంజీవి వర్గానికి చెందిన మంత్రిని కిరణ్‌రెడ్డి మాటలు పట్టుకుని అధిష్టానం తొలగిస్తుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. రేపు ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదంట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English