ఎన్టీఆర్ పెట్టిన ముహుర్త బ‌లం

ఎన్టీఆర్ పెట్టిన ముహుర్త బ‌లం

తెలంగాణ మ‌హానాడుకు ఏపీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ జాతీయాధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నేత‌ల్ని.. కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ మైదానంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పార్టీకి బ‌లం కార్య‌క‌ర్త‌లేన‌ని.. ఆ కార్య‌క‌ర్త‌ల్ని చూస్తూనే త‌న‌కు కొండంత బ‌లం వ‌స్తుంద‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌తి టీడీపీ కార్య‌క‌ర్తా కొద‌మ సింహంలా దూసుకెళుతున్నార‌న్నారు.

తెలంగాణ‌రాష్ట్రంలో టీడీపీ జెండా రెప‌రెప‌లాడే వ‌ర‌కూ పోరాడ‌తామ‌న్న చంద్ర‌బాబు.. ఎన్టీఆర్ పెట్టిన ముహుర్తం బ‌లం వ‌ల్ల‌నే మ‌నం ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కార్య‌క‌ర్త‌లే టీడీపీ బ‌లంగా చెప్పారు. తాను కుటుంబం కంటే కూడా కార్య‌క‌ర్త‌ల‌కే ఎక్కువ‌గా రుణ‌ప‌డి ఉంటాన‌న్న చంద్ర‌బాబు.. పార్టీ కోసం కార్య‌క‌ర్త‌లు ఎన్నో త్యాగాలు చేశారంటూ పొగిడేశారు.

పార్టీ కోసం కార్య‌క‌ర్త‌లు ఎన్నో త్యాగాలు  చేశార‌న్న చంద్ర‌బాబు.. తాను వారికి రుణ‌ప‌డి ఉంటాన‌ని.. కార్య‌క‌ర్త‌ల బ‌ల‌మే టీడీపీ బ‌లంగా చెప్పుకున్నారు. టీడీపీ వ‌చ్చాకే తెలంగాణ లో అనేక మార్పులు వ‌చ్చాయ‌న్నారు. ప‌టేల్‌.. ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యార‌న్నారు. ఎన్టీఆర్ పెట్టిన ముహుర్త బ‌లం వ‌ల్ల ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌టం లేద‌న్న ఆయ‌న‌.. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం పుట్టిన పార్టీ టీడీపీగా ఆయ‌న అభివ‌ర్ణించారు. తెలుగుజాతి బ‌తికి ఉన్నంత వ‌ర‌కూ వారి గుండెల్లో టీడీపీ గుర్తుండిపోతుంద‌న్నారు.

ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల్ని టీడీపీ తీసుకొచ్చింద‌న్న ఆయ‌న‌.. అన్ని ప్రాంతీయ పార్టీల్ని ఒక వేదిక మీద‌కు తెచ్చిన ఘ‌న‌త టీడీపీదేన‌న్నారు. నాడు పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్ష పోషించిన ప్రాంతీయ పార్టీ టీడీపీగా ఆయ‌న గుర్తు చేశారు.

టీడీపీ వ‌చ్చాకే తెలంగాణ‌లో అనే మార్పులు వ‌చ్చిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తాను ఎంత‌గానో రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అనేక సంక్షేమ కార్య‌క్రమాల్ని ప్ర‌వేశ పెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. స‌మైక్య రాష్ట్రంతో పోలిస్తే.. ఈ రోజు హైద‌రాబాద్ లో మ‌హానాడు బాగా జ‌రిగింద‌న్నారు చంద్ర‌బాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు