మ‌రోసారి భార్య చేతిలో ట్రంప్ కు ప‌రాభ‌వం

మ‌రోసారి భార్య చేతిలో ట్రంప్ కు ప‌రాభ‌వం

అమెరికా అధ్య‌క్ష హోదాలో తొలిసారి విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌న‌కు ఊహించ‌ని షాకులు త‌గులుతూనే ఉన్నాయి. ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న షాకుల‌న్నీ ఎవ‌రి నుంచో కాదు.. క‌ట్టుకున్న పెళ్లాం నుంచే.  ట్రంప్ ట‌చ్ ను సైతం ఆమె స‌హించ‌లేక‌పోవ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిన్న‌టికి నిన్న ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌లో భార్య చేతిని ప‌ట్టుకునేందుకు ట్రై చేసిన ట్రంప్‌న‌కు మెలానియా త‌న చేతిని వెన‌క్కి తీసుకోవ‌టం కెమేరా క‌ళ్లు ప‌సిగ‌ట్ట‌టం.. అదో వార్త‌గా మారి ప్ర‌పంచ ప్ర‌జ‌ల దృష్టి ప‌డేలా చేసింది.

తాజాగా రోమ్ ప‌ర్య‌టిస్తున్న ట్రంప్ న‌కు మ‌ళ్లీ మ‌రోసారి భార్య నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో దిగుతున్న వేళ‌.. ఫ్లైట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రంప్‌.. ప‌క్క‌నున్న మెలానియా చేతిని అందుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆ వెంట‌నే ఆమె త‌న చేతిని పైకి తీసేసుకొని.. చెవుల ద‌గ్గ‌రి ముంగురుల‌ను స‌వ‌రించుకుంది. దీంతో ఏం చేయాలో తోచ‌ని ట్రంప్‌.. ఆమె పిరుదుల మీద చేతిని ఆన్చి.. మ‌ళ్లీ త‌న చేతిని వెన‌క్కి తీసేసుకున్నారు.
రెండుసార్లు ట్రంప్ ట‌చ్ ను తాను ఏమాత్రం అంగీక‌రించ‌లేనట్లుగా మెలానియా  కావాల‌ని చేస్తున్నారా? లేక‌.. అనుకోకుండా జ‌రిగిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత వైట్ హౌస్‌కు రాని మెలానియా.. అదంతా త‌న కొడుకు చ‌దువు కోస‌మ‌ని చెప్ప‌టం తెలిసిందే. అయితే.. ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు స‌రిగా లేవ‌న్న వాద‌న వినిపిస్తున్నా..వాటిని బ‌ల‌ప‌రిచే ఘ‌ట‌న‌లు ఏమీ క‌నిపించ‌లేదు. తాజా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో మాత్రం.. ఇరువురి మ‌ధ్య దూరం ఎంత‌న్న విష‌యం కెమేరాల సాక్షిగా దొరికిపోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ట్రంప్ ట‌చ్ ను అంగీక‌రించ‌లేన‌ట్లుగా క‌నిపించిన మెలానియా వీడియో క్లిప్పింగ్ వైర‌ల్ గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు