అయ్యయ్యో పవన్‌కళ్యాణ్‌ జాడ లేదే

అయ్యయ్యో పవన్‌కళ్యాణ్‌ జాడ లేదే

పవన్‌ అభిమానులకి కొద్ది రోజులుగా ఒకే పని. పవన్‌ ట్విట్టర్‌ పేజీ ఓపెన్‌ చేసి రిఫ్రెష్‌ కొడుతూ ఏమైనా కొత్త ట్వీట్లు పడ్డాయా అని. ఒకటి పవన్‌ ట్వీట్‌ చేసాడో లేదో అనే ఎక్సయిట్‌మెంట్‌ కాగా, మరొకటి హ్యాక్‌ అయిన అకౌంట్‌ నుంచి ఏమైనా డేంజర్‌ ట్వీట్స్‌ పడ్డాయేమో అనే ఆందోళన ఇందుకు కారణం. పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందనే ప్రకటన వచ్చి చాలా రోజులవుతోంది.

సెలబ్రిటీ అకౌంట్ల విషయంలో ట్విట్టర్‌ వేగంగా స్పందిస్తుంది. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని పవన్‌ కొత్త ట్వీట్స్‌ వేయకపోవడాన్ని బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఆ అకౌంట్‌ నుంచి ఎలాంటి అభ్యంతరకరమైన ట్వీట్లు పడకపోవడంతో అసలు హ్యాక్‌ అయిందా అనే అనుమానం కలుగుతోంది.

ఒకటైతే క్లియర్‌... పవన్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ మిస్‌ అయింది. దానిని మార్చే ఆస్కారం కూడా పవన్‌కి లేకపోయింది. దీనికి కారణాలు ఇవీ అంటూ మీడియాలో కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. పవన్‌ కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేసుకోవాల్సిందే అని కూడా  ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని లక్షల మంది ఫాలోవర్లని మళ్లీ రాబట్టుకోవడం వెంటనే జరిగే పని కాదు. రాజకీయ విషయాలకి ట్విట్టర్‌ని విరివిగా వాడే పవన్‌కి ట్విట్టర్‌ యాక్సెస్‌ లేకపోవడం పెద్ద లోటు.

త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలకి సిద్ధమవుతోన్న పవన్‌కి ఇలాంటి టైమ్‌లో ఇది పెద్ద షాక్‌. ఇందులో ఫాన్స్‌ ఆనందించే విషయం ఏమిటంటే, ట్విట్టర్‌ యాక్సెస్‌ లేకపోవడంతో త్రివిక్రమ్‌ షూటింగ్‌ మామూలుగా కంటే వేగంగా జరుగుతోందట. పవన్‌కి డైవర్షన్లు లేకపోవడంతో ఇంకాస్త అటెంటివ్‌గా వుంటున్నాడట!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు