నాన్సెన్స్ పై బాబు సీరియ‌స్‌

నాన్సెన్స్ పై బాబు సీరియ‌స్‌

ఒకే ఒక్క స‌మావేశం.. తెలుగుదేశం, బీజేపీల మ‌ధ్య నెల‌కొన్న లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెడుతోంది. తెలుగుదేశం శ్రేణుల‌ను కుత‌కుత ఉడికిస్తోంది. ఆఖ‌రికి పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడును సైతం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఇంత‌కీ అదేంటంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అవ‌డం. ఆ ఎపిసోడ్‌లో తాజా ప‌రిణామం ఏమంటే...పార్టీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఫైర్ అవ‌డం.

ప్ర‌ధానితో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయిన అనంత‌రం టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. విప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్‌ను ఎప్ప‌ట్లాగే టార్గెట్ చేస్తూ...అందులోకి ప్ర‌ధాన‌మంత్రిని సైతం లాగారు. ఓ నిందితుడిని ప్రధాని మోడీ తన పక్కన ఎలా కూర్చుండ బెట్టుకుంటారని, దీనిపై మోడీ-బీజేపీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కామెంట్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలోనే ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ గ‌త ఎన్నిక‌ల్లో తనకు బీజేపీ వల్లే ఓట్లు తగ్గాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వచ్చేసారి ఆ పార్టీతో కలిసి పోటీ చేయకుంటే లక్షన్నర ఓట్లు సాధిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వార్త‌లు ఆనోటా...ఈనోటా మోడీజీ నోటీసుకు వెళ్లిన‌ట్లు, ప్ర‌ధాన‌మంత్రి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసినట్లు ప్ర‌చారం జ‌రిగింది. సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి అప్ సెట్ అవ‌డంతో...బాబు సైతం ఫీల‌యిపోయారట‌.

పార్టీ నేత‌ల స‌మావేశంలో ఈ ఇద్ద‌రు నేత‌ల తీరును బాబు తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. మిత్ర‌ప‌క్షంగా బీజేపీతో కేంద్రంలో- రాష్ట్రంలో కలిసి ఉన్నామనే విషయాన్ని గుర్తించకుండా పార్టీ నేత‌లు ఇలా కామెంట్లు చేయ‌డం ఏమిట‌ని బాబు అసహ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. రాజేంద్రప్రసాద్ అలా మాట్లాడ‌టం స‌రికాద‌ని, ఆయ‌న వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక నుంచి పార్టీ నేతలు ఎవరైన బీజేపీ-టీడీపీ దోస్తీని గుర్తుంచుకొని వ్య‌వ‌హ‌రించాల‌ని బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే తాము ఎప్ప‌ట్నుంచో హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ త‌మ్ముళ్ల‌ను బాబు అదుపులో పెట్టుకోలేక‌పోయార‌ని, అందుకే ప్ర‌ధాన‌మంత్రిపై కూడా టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసేస్తున్నార‌ని బీజేపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు