ప్రేమ పక్షులు ఉప్పల్ స్టేడియంలో వాలాయ్

ప్రేమ పక్షులు ఉప్పల్ స్టేడియంలో వాలాయ్

‘ధోని’ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యాడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి జనాలకు అతడి పర్సనల్ లైఫ్ మీద కూడా బాగా ఆసక్తి ఏర్పడింది. ఇంతకుముందు అంకిత లోఖండే అనే అమ్మాయితో చాన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు సుశాంత్. ఐతే గత ఏడాది ఆమె నుంచి విడిపోయి.. ‘1 నేనొక్కడినే’ భామ కృతి సనన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టినట్లుగా గుసగుసలు వినిపించాయి. వీళ్లిద్దరూ కలిసి బోలెడన్ని సార్లు కెమెరాలకు చిక్కారు. ఈ మధ్య సుశాంత్ కొత్తగా కొన్న లగ్జరీ కారులో కృతిని కూర్చోబెట్టుకుని చక్కర్లు కొట్టడం పెద్ద చర్చకే దారి తీసింది. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ సైతం వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే అంటూ ఓ కథనం కూడా ప్రచురించింది.

ఈ కథనాలకు బలం చేకూరుస్తూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ కలిసి ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి కలిసి రావడం విశేషం. ముంబయిలో చక్కర్లు కొట్టడం ఓకే కానీ.. ఇలా ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు కలిసి రావడం.. స్టేడియంలో పక్క పక్కన కూర్చుని ముచ్చట్లాడుకుంటూ.. చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ జనాల కళ్లల్లో పడటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే. తమ రిలేషన్‌షిప్ గురించి ఏమీ దాచాలని ఈ జంట అనుకుంటున్నట్లు లేదు.

ప్రేమలో నిండా మునిగాక చలేంటన్నట్లే ఉంది వీళ్ల తీరు చూస్తే. బాలీవుడ్లో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసే ఏ జంట కూడా తమ బంధం గురించి మాటలతో కన్ఫమ్ చేయదు. కానీ తమ చేష్టల ద్వారానే ప్రేమ బంధం గురించి చెప్పకనే చెబుతుంది. సుశాంత్-కృతి కూడా అలాగే చేస్తున్నట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English