మోడీ హత్య చేయాలంటూ 50 కోట్ల డీల్?

మోడీ హత్య చేయాలంటూ 50 కోట్ల డీల్?

మన ప్రధాని మోడీని హత్య చేసేందుకు పాకిస్థాన్ లోని కొన్ని అరాచక శక్తులు అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నాయనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఉండే సోని అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోడీని చంపేందుకు తమతో చేయి కలపాలని... దానికి ప్రతిఫలంగా రూ. 50 కోట్లు ఇస్తామని ఆ వ్యక్తి ఆఫర్ చేశాడు.

అప్పటికే దీని కోసం ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశామని, మూడో వ్యక్తి కూడా అవసరమని చెప్పాడు. ఈ డబ్బు సరిపోకపోతే... ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ కూడా పెట్టారట. తొలుత ఈ ఫోన్ కాల్ ను సోనీ పట్టించుకోలేదు. కానీ, విషయానికి ఉన్న తీవ్రత దృష్ట్యా స్థానిక పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని క్రైంబ్రాంచ్ కు అప్పగించారు.

దాంతో ఫోన్ ఏ నంబరు నుంచి వచ్చిందో దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఇది నిజమైనదేనా.. ఫేకా... ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు... సోనీనే పాకిస్థానీ ముఠాలు ఎందుకు ఎంచుకున్నాయి.. లేదంటే వేరొకరి ఫోన్ చేయబోయి సోనీకి చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు