ఆమెను జీప్ కు కట్టేయాలన్న సీనియర్ యాక్టర్

ఆమెను జీప్ కు కట్టేయాలన్న సీనియర్ యాక్టర్

సీనియర్ యాక్టర్, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్‌పై  ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను జీపు ముందు భాగానికి కట్టేయాలని ఆయన అన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన ఆయన కశ్మీర్‌లో రాళ్లు  విసిరిన ఒక యువకుడిని  ఆర్మీ జీప్‌కు కట్టినట్లుగా అరుంధతీ రాయ్ ను కూడా ఆర్మీ జీప్ కు కట్టేయాలని ట్వీట్‌ చేశాడు. దీంతో దుమారం చెలరేగింది.  

పరేస్‌ రావెల్  వ్యాఖ్యలపై  ట్విట్టర్‌లో చాలామంది మండిపడుతున్నారు.  నెటిజన్లు ఆయనకు వ్యతిరేకంగా ఘాటు కామెంట్లు పెడుతున్నారు. కాగా  2014 సాధారణ ఎన్నికల్లో అహ్మదాబాద్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి  పరేష్‌ రావల్‌ పార్లమెంటుకు  ఎంపికయ్యారు. ఎన్నడూ పెద్దగా జనంలో నానని పరేష్ ఎందుకనో హఠాత్తుగా అరుంధతీరాయ్ ను టార్గెట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు.

కాగా శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గం జిల్లాలోని ఒక గ్రామంలో  తమపై దాడి జరపకుండా, ఓ వ్యక్తిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకుపోయిన భద్రతా దళాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే.  పోలింగ్ ఆఫీసర్లను చుట్టుముట్టి రాళ్లదాడికి నిరసనకారులు పాల్పడుతున్న వేళ, వారికి రక్షణ కోసం ఓ స్థానిక యువకుడిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకెళ్లారన్నది ఆరోపణ. ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఏప్రిల్లో వీడియోను ట్వీట్  చేస్తూ తక్షణ విచారణన జరిపించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు