వచ్చారు.. వస్తారు.. బాబు హ్యాపీనే

వచ్చారు.. వస్తారు.. బాబు హ్యాపీనే

ఎంతకాలమని పార్టీలోంచి నేతలు వెళ్ళిపోతూనే ఉంటారు, ఒక్కరైనా తిరిగి రాకపోరు కదా అని ఎదురు చూసిన చంద్రబాబుకి సాంత్వన చేకూరింది కొంతవరకు. టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన దొమ్మేటి సాంబయ్య, తిరిగి చంద్రబాబు పంచన చేరారు.

దొమ్మేటి సాంబయ్య చేరిక శుభ శకునమని ఇకపై తమ పార్టీలోకి పెద్దయెత్తున నేతలు వస్తారని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు. 'మేం గేట్లు తెరిస్తే అంతే..' అని ఇదివరకే చెప్పిన చంద్రబాబు ఏం తెరిచారోగాని ఇప్పటికైతే ఒక్కరే వచ్చారు. చాడ సురేష్‌రెడ్డి, రఘునందన్‌రావు లైన్‌లో ఉన్నారో లేదో తెలీదు. వీరిద్దరినీ వేరే పార్టీలు ఆకర్షిస్తున్నాయంట.

ఏదేమైనా చంద్రబాబుతోపాటుగా తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది దొమ్మేటి సాంబయ్య పునఃప్రవేశంతో. ఒకర్ని చూసి ఇంకొకరు తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఆశిస్తున్న చంద్రబాబు, తమ పార్టీలోకి పెద్దయెత్తున వలసల్ని చూడగలుగుతారంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English