బాబుకు జ‌గ‌న్ అడ్డంగా దొరికిపోయిన‌ట్లున్నాడే!

బాబుకు జ‌గ‌న్ అడ్డంగా దొరికిపోయిన‌ట్లున్నాడే!

ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అవ‌డం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయంగా మైలేజ్ ద‌క్క‌డం కంటే మైన‌స్‌గా మారిన‌ట్లే క‌నిపిస్తోంది. ప్ర‌ధానితో త‌న స‌మావేశం ఎందుకో చెప్పిన‌ప్ప‌టికీ అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేసే పాయింట్ల ఆధారంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా బహిరంగ సభలో వైఎస్ జ‌గ‌న్‌పై  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ప్యాకేజీ తీసుకోడానికి కేంద్రంతో రాజీపడగా తనను కేసుల నుంచి తప్పించమని కోరడానికి ప్రధానమంత్రి మోడీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ రాజీ కుదుర్చుకున్నారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

ప్రధానమంత్రిని జగన్‌ కలిసినందుకు తనకు అభ్యంతరం లేకున్నా జూన్‌లోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేస్తానన్న జగన్‌ దానిపై ఏం చేస్తారో ఎందుకు చెప్పడం లేదని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.  ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేస్తానని జగన్‌ చెప్పిన విషయం మీరంతా విన్నారు కదా అని బహిరంగ సభలో ప్రజలను అడిగిన చంద్రబాబు ఎవరు కేంద్రంతో ఏ విషయంలో రాజీ పడ్డారనే అంశాన్ని మీరే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. తాను కేవలం రాష్ట్ర ప్రజల కోసమే ప్రత్యేక ప్యాకేజి తీసుకోడానికి సిద్ధపడ్డానని, జగన్‌ ఎప్పుడూ తన కేసుల కోసం, బెయిల్‌ తెచ్చుకోడానికే కేంద్రంతో రాజీ పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ముందు వ్యతిరేకించిన జ‌గ‌న్‌...తనపై పెట్టిన కేసుల గురించి కేంద్రంతో రాజీపడి విభజనపై ప్రత్యక్ష పోరాటాన్ని చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి జలాలను కలిపిన తాను వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్ర‌బాబు తెలిపారు. ఆ లక్ష్యంతోనే ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు సాధించేవరకు సోమవారాన్ని పోలవారంగా పిలుస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నానని పేర్కొంటూ పెండింగ్‌ లో వున్న రాయలసీమనీటి ప్రాజెక్టులన్నీరెండేళ్లలో పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి నీటి బొట్టును స‌ద్వినియోగం చేసుకునేలా త‌న ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English