అబద్ధాల అమిత్‌షా గో బ్యాక్‌...మోసకారి మోడీ గో బ్యాక్‌

అబద్ధాల అమిత్‌షా గో బ్యాక్‌...మోసకారి మోడీ గో బ్యాక్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో చేతులు ఎత్తేయ‌డం స‌హా ఇత‌ర‌త్రా హామీల‌ను బీజేపీ నిల‌బెట్టుకోలేక‌పోయింద‌ని ఇప్ప‌టికే విమ‌ర్శిస్తున్న ఏపీ కాంగ్రెస్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో త‌న నిర‌స‌న‌ల‌కు ప‌దును పెడుతోంది.తాను ఒంట‌రిగానే నిర‌స‌న‌లు తెల‌ప‌కుండా వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న నిర‌స‌న‌కు కూడా కాంగ్రెస్‌ మ‌ద్ద‌తుగా నిలిచింది.

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన విలేక‌రుల స‌మావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ మునియప్ప, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. "అబద్ధాల అమిత్‌షా గో బ్యాక్‌ – మోసకారి మోడీ గో బ్యాక్‌" నినాదంతో ఈనెల 24న రాయలసీమలో వామపక్షాలు చేపడుతున్న బంద్‌కు కాంగ్రెస్ త‌ర‌ఫున మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు  ర‌ఘువీరారెడ్డి ప్రకటించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ మోసం తీరును నిర‌సిస్తూ అమిత్ షా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా  ఈనెల 25న అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్ల‌డించారు. ప్రత్యేక హోదాకు మద్దతిచ్చిన 14 పార్టీలను ఆహ్వానించేందుకు ఈనెల 23న ఢిల్లీ వెళ్తున్నట్లు ర‌ఘువీరారెడ్డి చెప్పారు.

ఎంపీ మునియప్ప మాట్లాడుతూ తనను ఎన్నికలయ్యే వరకు ఏపీ వ్య‌వ‌హారాల‌ పీఆర్వోగా నియమించినందుకు కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్య‌క్షుడు  రాహుల్ గాంధీకి మునియప్ప కృతజ్ఞతలు చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తాన‌ని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు