గొట్టిపాటి ఓ న‌పుంస‌కుడు...క‌ర‌ణం ఫైర్‌

గొట్టిపాటి ఓ న‌పుంస‌కుడు...క‌ర‌ణం ఫైర్‌

తెలుగుదేశం పార్టీలో వ‌ర్గ విబేధాలు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల స్థాయికి చేరిపోయాయి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లి కురవ మండలం వేమవరం గ్రామంలో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గానికి చెందిన వారిపై కొందరు దుండగులు కత్తులతో దాడిచేసిన ఘ‌ట‌నకు సంబంధించిన విమ‌ర్శ‌ల ప‌ర్వం ఇంకా కొన‌సాగుతోంది. ఈ ఘటనలో ఇరువురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

ఈ హత్యలపై ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్‌ నపుంసకుడంటూ ఆయన మండిపడ్డారు. ఈ దాడుల విషయంపై సీఎం చంద్ర‌బాబు ఏం సమాధానం చెబుతారో చూద్దామని క‌ర‌ణం వ్యాఖ్యానించారు.

కాగా, ఇదే విషయమై కరణం బలరాం కుమారుడు మీడియాతో మాట్లాడుతూ ఏకంగా గొట్టిపాటి ర‌వికుమార్‌కు స‌వాల్ విసిరారు.  హ‌త్య‌లు చేయ‌డం పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలతో కాదు దమ్ముంటే నాయకులతో తేల్చుకోవాలంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రవికుమార్‌కు సవాల్ విసిరారు. కాగా హ‌త్య‌ల ఉదంతం రాష్ట్ర స్థాయిలో క‌ల‌కలం రేకెత్తించిన నేప‌థ్యంలో ఎమ్మెల్యే రవికుమార్ స్పందించారు.

దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని వివ‌రించారు. "నాపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు.  హ‌త్యా రాజకీయాల కార‌ణంగా నా కుటుంబంలో ఎంతో మందిని కోల్పోయాను. అలాంటి వాటిని ప్రోత్సహించను. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎంను కోరతాను అని తెలిపారు" అని గొట్టిపాటి రవి స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు