హిందూమతంలోకి తలాఖ్‌ బాధితురాలు!

హిందూమతంలోకి తలాఖ్‌ బాధితురాలు!

ట్రిపుల్ త‌లాఖ్ కార‌ణంగా ముస్లిం మ‌హిళ‌లు ఏ విధ‌మైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో, విముక్తి అవ‌కాశాల వైపు ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నారో తెలియ‌జెప్పేందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఇది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో త్రిపుల్‌ తలాఖ్ ఎపిసోడ్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను హిందువుగా మారతానని ఒక త్రిపుల్ తలాఖ్ బాధితురాలు సంచలన ప్రకటన చేశారు.  తనకు  హిందువుగా మారడం కాని, ఆత్మహత్య చేసుకోవడం కాని తప్ప ఇతర మార్గం లేదని షమీమ్‌ జహాన్‌ అనే త్రిపుల్‌ తలాఖ్‌ బాధితురాలు చెప్పారు.

స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆమె భర్త ఆసిఫ్‌ ఆమెకు మూడుసార్లు తలాఖ్‌ చెప్పి విడాకులిచ్చాడు. దీంతో 12 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత నలుగురు పిల్లలతో ఎలా బ్రతకాలో తెలియని స్థితికి ఆమె చేరిపోయింది. దీంతో త‌న ఆవేద‌న‌ను మీడియాతో వెల్ల‌డించింది. తాను హిందూమతంలోకి మారితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

హిందూమతంలో ఇటువంటి ఆచారాలు ఉండవని ఆమె అన్నారు. లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప శరణ్యం లేదని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు తన విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. స‌ద‌రు మ‌హిళ‌ మాట్లాడిన వీడియో టేపు హల్‌చల్‌ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు