టీడీపీ ఆఖ‌రు ఆశ‌...సైకిల్ ఎక్క‌నున్న రాముల‌మ్మ‌?

టీడీపీ ఆఖ‌రు ఆశ‌...సైకిల్ ఎక్క‌నున్న రాముల‌మ్మ‌?

పొలిటిక‌ల్ క్రాస్ రోడ్స్‌లో ఉన్న వెట‌ర‌న్ హీరోయిన్ రాములమ్మ త‌న త‌ర్వాతి గ‌మ్య‌స్థానం తెలుగుదేశం పార్టీని ఎంచుకోనున్నారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి తెలుగు తమ్ముళ్లు పడుతున్న పాట్ల‌లో ఆఖ‌రి ఆశ‌గా వారికి విజ‌య‌శాంతి క‌నిపించారా? 2019లో  పచ్చజెండా ఎగరాలంటే కొద్దొగొప్పో ఉద్యమకారులను న‌మ్ముకోవ‌డ‌మే మేల‌నే నిర్ణ‌యానికి టీటీడీపీ వ‌చ్చిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విజ‌య‌శాంతి ఆ ఎన్నిక‌ల్లో ఓటమి అనంత‌రం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తెర‌మ‌రుగు అయ్యారు.  కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాల‌కు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో చోటుచేసుకున్న ప‌రిణామాల్లో చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గానికి రాములమ్మ మ‌ద్ద‌తిచ్చారు.

ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్న రాములమ్మ యాక్టివ్ అవుతుండటం, తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన మహిళా నేత అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో రాముల‌మ్మ‌ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో టీడీపీ నేత‌లు ఉన్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే టీడీపీ సీనియర్లు విజయశాంతితో చర్చలు జరుపుతున్నారన్నది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్న సమాచారం. ఇంత‌కీ విజ‌య‌శాంతి టీడీపీ కండువ కప్పుకోబోతున్నారా? టీటీడీపీ ప్ర‌య‌త్నం ఎంత‌మేర‌కు విజ‌య‌వంతం కానుంది అనేదానికి స‌మాధానం కోసం వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు