ఉద్యోగానికి ఇవి బెస్ట్ కంపెనీలు

ఉద్యోగానికి ఇవి బెస్ట్ కంపెనీలు

ఇండియాలో ఎన్నో సంస్థలు.. దేశీయ దిగ్గజాలు, అంతర్జాతీయంగా మకుటాయమానంగా వెలిగే సంస్థలు. అయితే... ఒక్కో సంస్థదీ ఒక్కో తీరు. ఉద్యోగులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేవి కొన్ని కంపెనీలే. పనితీరు పరంగా, వేతనాలు, ఒత్తిళ్లు, ఉద్యోగ స్థిరత్వం, కెరీర్ గ్రోత్  వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగులు ఏ కంపెనీల్లో పనిచేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారన్నది కీలకం.

ఇలా పనిచేయడానికి అత్యంత ఎక్కువగా ఇష్టపడే కంపెనీలేమిటనే విషయంలో లింక్డ్ ఇన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.... ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో పనిచేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారట. లింక్డ్ ఇన్ భారత టాప్ కంపెనీల 2017 జాబితాలో ఈ రెండూ వరుసగా రెండో ఏడాది కూడా టాప్ లో నిలిచాయి.

ఈ రెండింటి తర్వాత మూడో స్థానంలో కేపీఎంజీ ఇండియా స్థానం దక్కించుకుంది. లింక్డ్ ఇన్ రూపొందించిన ఈ జాబితాలో ఈ మూడు కంపెనీల త‌ర్వాత వ‌రుస‌గా టాప్-10 జాబితాలో వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం), ఓలా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, అడోబ్ , ఆల్ఫాబెట్ , ఓయో రూమ్స్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ పదో స్థానాల్లో నిలిచాయి. టాప్-25 కంపెనీల్లో 30 శాతం కొత్త కంపెనీలే ఉన్నాయి.

కాగా టెక్ మహింద్రా, వన్ 97 కమ్యూనికేషన్స్, స్విగ్గీ, ఐడీఎఫ్సీ బ్యాంకు, వొడాఫోన్, ఓరాకిల్, గ్రోఫర్స్, మెకిన్సే అండ్ కంపెనీ లాంటివి ఈ జాబితాలో కొత్తగా వచ్చి చేరాయి. గతేడాది టాప్ 10 లోనే ఉన్న ఓలా ఈ ఏడాది మరింత ముందుకు జరిగి టాప్ 5 స్థానానికి వచ్చింది. ఓయో రూమ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిస్కో కంపెనీలు కూడా తమ ర్యాంకింగ్స్ ను పెంచుకున్నాయి.

భారత ప్రొఫిషినల్స్ కు  కంపెనీల సంప్రదాయం, వృద్ధి అవకాశాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం కోసం అత్యంత ఆకట్టుకుంటున్న కంపెనీలను జాబితాను అనాలసిస్ చేశామని లింక్డ్ ఇన్ ఇండియా డైరెక్టర్ టాలెంట్ సొల్యుషన్స్ అండ్ లెర్నింగ్ సొల్యుషన్స్ ఇర్ఫాన్ అబ్దుల్లా చెప్పారు.  అంతర్జాతీయ సంస్థల కంటే దేశీయ సంస్థలపై ఇండియన్లు మక్కువ చూపుతున్నారని తేలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు