ఆ బౌల‌ర్ ల‌క్కీగాళ్ సీక్రెట్ తెలిసిపోయింది

ఆ బౌల‌ర్ ల‌క్కీగాళ్ సీక్రెట్ తెలిసిపోయింది

గ‌తంలో ప్ర‌ముఖుల‌కు సంబంధించి ముచ్చ‌ట్ల‌ను.. గుట్టుమ‌ట్ల‌ను బ‌య‌ట పెట్టే బాధ్య‌త‌ను మీడియా తీసుకునేది. మారిన కాలంతో ఇది పూర్తిగా మారిపోయింది. సోష‌ల్ మీడియా అందుబాటులోకి రావ‌టంతో ఎవ‌రికి వారు.. పౌర‌పాత్రికేయం మొద‌లెట్టేశారు. త‌మ‌కు తెలిసిన విష‌యాల్ని సోష‌ల్ మీడియాలో చెప్పేస్తున్నారు. అలా అని అన్ని నిజాలే చెప్ప‌కున్నా.. కొంత‌మంది మాత్రం బాధ్య‌త‌తో తాము చెప్పే విష‌యాల‌కు త‌గ్గ ఆధారాలు చూపిస్తూ.. విష‌యం ఇది సుమా అని తేల్చేస్తున్నారు.

టీమిండియా యువ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇటీవ‌ల ఒక ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రెస్టారెంట్‌లో డిన్న‌ర్ చేస్తున్న ఫోటో ఇది. డిన్న‌ర్ డేట్‌.. పూర్తి చిత్రం త్వ‌ర‌లో అంటూ పెట్టిన పోస్ట్ అభిమానుల‌తో పాటు.. అంద‌రిలోనూ స‌రికొత్త ఆస‌క్తిని రేపింది. ఇంత‌కీ భువి ల‌క్కీ గాళ్ ఎవ‌ర‌న్న దానిపై పెద్ద చ‌ర్చే న‌డిచింది.

ఇటీవ‌ల కాలంలో టీమిండియాలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా పెళ్లిళ్లు చేసుకుంటున్న వేళ‌.. భువి కూడా లిస్ట్ లోకి వ‌చ్చేశాడ‌న్న మాట అన్న వాద‌న వినిపించింది. త‌న ల‌క్కీ గాళ్ ఎవ‌ర‌న్న విష‌యాన్ని భువి బ‌య‌ట‌పెట్ట‌టానికి ముందే.. సోష‌ల్ మీడియాలో ఆమె ఎవ‌ర‌న్న విష‌యాన్ని బ‌య‌ట పెడుతూ పోస్టింగులు పెట్టేశారు.

ఇంత‌కీ భువి ల‌క్కీగాళ్ ఎవ‌రో కాదు.. ప్ర‌ముఖ మోడ‌ల్‌.. టాలీవుడ్ న‌టి అనుస్మృతి స‌ర్కార్‌. వంకాయ్ ఫ్రై.. ఇష్ట‌స‌ఖి.. హీరోయిన్ చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ భామ‌.. బెంగాలీలో నాలుగు సినిమాల్లో చేసింది కూడా. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న వేళ‌.. ఆ ఛాన్స్ సంగ‌తేమో కానీ.. భువితో ల‌వ్ ట్రాక్ మొద‌లైంది. వీరిద్ద‌రూ క‌లిసి కారులో వెళ్తున్న వైనాన్ని చూసిన వెంట‌నే.. చేతిలోని ఫోన్ల‌తో క్లిక్ మ‌నిపించేసి సోష‌ల్ మీడియాలో పెట్టేయ‌టంతో.. భువి ల‌క్కీ గాళ్ ఎవ‌ర‌న్న‌ది తేలిపోయింది. సో.. భువి గర్ల్ ఫ్రెండ్ ఎవ‌ర‌న్న స‌స్పెన్స్ తీరిపోయింది.. మిగిలింది అధికారికంగా ప్ర‌క‌టించ‌ట‌మే మిగిలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English