ర‌జనీ మాట‌..యుద్ధానికి సిద్ధంగా ఉండాలి

ర‌జనీ మాట‌..యుద్ధానికి సిద్ధంగా ఉండాలి

త‌మిళ‌నాడు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ త‌న ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. తళైవా పొలిటికల్‌ ఎంట్రీ ఉంటుందా? ఉండదా.? ఉంటే తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటిమార్పులు రాబోతున్నాయి..? ఈ ప్రశ్నలు అంతటా వ్యక్తమవుతున్న స‌మ‌యంలో వరుసగా గత ఐదురోజులుగా ఫ్యాన్స్‌తో భేటీ అవుతున్న ర‌జనీ తాజాగా తమిళనాడులోని కొడంబాక్కంలో గల అభిమానులతో నేడు సమావేశమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విష‌యంలో ర‌జనీ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

తమిళనాడులోని అభిమానులతో భేటీ సందర్భంగా రజనీ తన స్థానికత అంశాన్ని లేవనెత్తారు. తాను పొరుగు రాష్ర్టానికి చెందిన వ్య‌క్తిని కాద‌ని, ఇప్పుడు పక్కా తమిళుణ్ని అని తెలిపారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నానని,  తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానని రజనీ తెలిపారు. తాను పుట్టింది మహారాష్ట్రలో అయినా అభిమానులు తనని తమిళుణ్ని చేశారన్నారు.

ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న రజనీకాంత్ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. “మన వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారు. కుళ్లిన వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది”  అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే తన రాజకీయ ప్రవేశంపై మాత్రం సమాధానాన్ని రజనీ మరోసారి దాటవేశారు. అయితే ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ పెట్ట‌డం ఖాయం అని అంద‌రూ భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు