ఏమైనా స‌రే.. ఇండియ‌న్స్ కు ఇళ్లు అద్దెకు ఇవ్వ‌డ‌ట‌

ఏమైనా స‌రే.. ఇండియ‌న్స్ కు ఇళ్లు అద్దెకు ఇవ్వ‌డ‌ట‌

బ్రిటీష్ సంప‌న్నుడి మాట ఇప్పుడు భార‌తీయుల‌కు ఒళ్లు మండేలా చేస్తోంది. బ్రిట‌న్ లో సంప‌న్నుడిగా పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు.. వెయ్యికి పైగా ఫెర్గూస్ ఇళ్లు ఉన్న పెద్ద మ‌నిషి భార‌త‌.. పాకిస్థాన్ ల‌కు చెందిన వారికి ఇళ్లు ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్నాడు. తానీ మాట‌ను ఎక్క‌డైనా చెబుతాన‌ని.. ఎంత‌వ‌ర‌కైనా వెళ‌తాన‌ని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ఆయ‌న చెప్పే రీజ‌న్ వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

త‌న వ‌ద్ద ఉన్న వంద‌లాది ఇళ్ల‌ను భార‌త్‌.. పాక్ జాతీయుల‌కు అద్దెకు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెబుతున్నారు బ్రిట‌న్ సంప‌న్నుడు ఫెర్గూస్ విల్స‌న్. త‌న వ్యాఖ్య‌లు న్యాయ‌ప‌ర‌మైన వివాదం చెల‌రేగినా తాను త‌గ్గ‌నంటే త‌గ్గ‌న‌ని తేల్చేస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌నంత మొండిగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న చూస్తే.. తాను ఇళ్ల‌ను ఇవ్వ‌న‌ని చెబుతున్న‌ది వారి శ‌రీర వ‌ర్ణానికి సంబంధించి కాద‌ని.. వారి కూర‌కు సంబంధించింద‌ని చెబుతున్నారు.

భార‌త‌.. పాక్ జాతీయులకు ఇళ్ల‌ను అద్దెకు ఇచ్చిన త‌ర్వాత‌.. వాటిని వారు ఖాళీ చేసిన త‌ర్వాత ఘాటైన క‌ర్రీ వాస‌న‌లు ఇంటిని ప‌ట్టేస్తున్నాయ‌ని.. అవి ఒక ప‌ట్టాన విడిచిపోవ‌టం లేద‌ని చెబుతున్నారు. క‌ర్రీ వాస‌న పోవ‌టానికి.. కార్పెట్ల‌ను మార్చ‌టానికి ఖ‌ర్చు అవుతుంద‌ని చెబుతున్నారు.

ఫెర్గూస్ విదించిన నిషేధంపై బ్రిట‌న్ మాన‌వ హ‌క్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యుమ‌న్ రైట్స్ క‌మిష‌న్ కోర్టులో స‌వాలు చేశారు. త‌న ఏజెంట్ల‌కు భార‌త్‌.. పాక్ జాతీయుల‌కు ఇళ్ల‌ను అద్దెకు ఇవ్వొద్దంటూ అత‌గాడు రాసిన లేఖ బ‌య‌ట‌కు రావ‌టంతో ఇదో వివాదంగా మారింది. మ‌రీ.. పెద్ద‌మ‌నిషి మాట‌ల‌కు అక్క‌డి వ్య‌వ‌స్థ‌లు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు