జైల్లో ఉన్న ఆ మాజీ సీఎం ఇంట‌ర్ పాస‌య్యారు

జైల్లో ఉన్న ఆ మాజీ సీఎం ఇంట‌ర్ పాస‌య్యారు

ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఒక నేత‌.. త‌ర్వాతి కాలంలో అవినీతి ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా నిరూపిత‌మై.. జైలుకు వెళ్లిన ఉదంతాలు ఈ దేశంలో కొత్తేం కాదు. కానీ.. జైలుశిక్ష అనుభ‌విస్తూ.. చ‌దువుకొని పాస్ కావ‌టం కాస్తంత కొత్త విష‌య‌మే. అది కూడా 82 ఏళ్ల వ‌య‌సులో అంటే క‌చ్ఛితంగా తెలుసుకోవాల్సిన అంశ‌మే. ఇంత‌కీ.. ఆ మాజీ ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న విష‌యంలోకి వెళితే..

హ‌ర్యానా రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు ఓం ప్ర‌కాష్ చౌతాలా. అయితే.. 2000లో జ‌రిగిన టీచ‌ర్ల నియామ‌కంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న మీద వ‌చ్చాయి. 3206 టీచ‌ర్ల నియామ‌కంలో అవినీతి జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై జ‌రిగిన విచార‌ణ‌లో.. ఆయ‌న త‌ప్పు తేల‌ట‌మే కాదు.. దోషిగా నిరూపిత‌మై జైలుశిక్ష‌కు గుర‌య్యారు. ప‌ది సంవ‌త్స‌రాల జైలుశిక్ష ప‌డిన ఆయ‌న 2015 నుంచి తీహార్ జైల్లో  శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు.

కోర్టు తీర్పులో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఆయ‌న‌.. 82 ఏళ్ల వ‌య‌సులోనూ చ‌దువుకోవ‌టం గ‌మ‌నార్హం. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాసిన ఆయ‌న ఫ‌స్ట్ క్లాస్ లో పాస్ కావ‌టం గ‌మ‌నార్హం. త‌న తండ్రి ఇంట‌ర్ పాస్ కావ‌టంపై చౌతాలా కుమారుడు.. విప‌క్ష నేత అభ‌య్ సింగ్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో పెరోల్ పై ఉన్న ఆయ‌న జైల్లోని కేంద్రానికే వెళ్లి చ‌దువుకున్నార‌ని.. పెరోల్ ముగిసిన త‌ర్వాత జైలుకు వెళ్లార‌ని.. ఇప్పుడాయ‌న డిగ్రీ చ‌ద‌వాల‌ని అనుకుంటున్న‌ట్లుగా వెల్ల‌డించారు. లేటు వ‌య‌సులో చ‌దువు మీద ఇంత‌గా మ‌న‌సు మ‌ళ్లిన మాజీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పేరు నిలిచిపోతుందేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు