అనాథ‌లా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆ ఎమ్మెల్సీ

అనాథ‌లా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆ ఎమ్మెల్సీ

ఎంత పెద్ద పార్టీకి చెందిన నేత అయినా, ఎంత మంచి ప‌ద‌వి అయినా కూడా ఒక్కోసారి విలువ‌లేనిదిగా మారిపోతుంది. తాజాగా ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న ఈ రోజు మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే... నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న ఆయ‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అత్యంత సాదాసీదాగా జ‌రిగింది. అందుకు కార‌ణం తెలిసిందే.

వాకాటిని ఇటీవలే తెలుగుదేశం పార్టీ స‌స్పెండ్ చేసింది. దీంతో మండలి చైర్మన్ చక్రపాణి ఆయనతో ప్రమాణం చేయించినా ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలెవరూ హాజరు కాలేదు. వాకాటి ఒక్కరే వచ్చి, చక్రపాణి కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.

వివిధ కంపెనీల పేరిట బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేదన్న ఆరోపణలతో ఇటీవల వాకాటి ఇంటిపై సీబీఐ దాడులు జరిగిన నేపథ్యంలో, ఆయన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాకాటి ప్రమాణ స్వీకారానికి పార్టీ దూరమైంది. దీంతో ఆయ‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం వెల‌వెల‌బోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు