దిల్‌ రాజుకి సరండర్‌ అయిపోయాడు

దిల్‌ రాజుకి సరండర్‌ అయిపోయాడు

రాజ్‌ తరుణ్‌తో దిల్‌ రాజు రెండు సినిమాలకి ఒప్పందం చేసుకున్నాడు. అయితే అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ రాజ్‌ తరుణ్‌ కాస్త అత్యాశకి పోయాడట. దిల్‌ రాజు బ్యానర్‌లో నటించే అవకాశాన్ని అతను పెద్ద ఆపర్చునిటీగా గుర్తించలేకపోయాడట.

తన విజయాలకి అనుగుణమైన పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేసాడట. దాంతో దిల్‌ రాజు అతడిని తప్పించి ఆ రెండు సినిమాలకి వేరే హీరోలని తీసుకున్నాడని చెప్పుకున్నారు. రాజ్‌ తరుణ్‌ మిస్‌ అయిన ఆ రెండు చిత్రాలే శతమానం భవతి, నేను లోకల్‌ అని కూడా వార్తలొచ్చాయి. రెండు భారీ బ్లాక్‌బస్టర్లు  మిస్‌ అయిపోయిన రాజ్‌ తరుణ్‌కి మళ్లీ ఇప్పుడు దిల్‌ రాజు బ్యానర్లో చేసే అవకాశం వచ్చింది.

ఈసారి పారితోషికం గురించి కనీసం డిస్కషన్‌ కూడా పెట్టకుండా దిల్‌ రాజు కాల్‌ చేయగానే చేస్తున్నానని చెప్పేసాడట. 'అలా ఎలా' అనే చిత్రాన్ని తీసిన అనీష్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. మరి రాజ్‌ తరుణ్‌ మిస్‌ అయిన ఆ బ్లాక్‌బస్టర్లకి తగ్గ విజయాన్ని ఈ చిత్రంతో అందుకుంటాడో లేదో చూడాలి.

దిల్‌ రాజు బ్యానర్లోకి అంటూ అడుగు పెడితే ఇక అక్కడ పర్మినెంట్‌గా సెటిల్‌ అయిపోవచ్చు కనుక రాజ్‌ తరుణ్‌ ఈ ఫలితం గురించి అంతగా పట్టించుకోకపోవచ్చు. తనలాంటి ఎదుగుతోన్న నటుడికి దిల్‌ రాజులాంటి పెద్ద అండ చాలా అవసరం కదా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు