'గులాబీ' చెట్టుకి 'ముల్లు' తప్పదుగా

'గులాబీ' చెట్టుకి 'ముల్లు' తప్పదుగా

గులాబీ చెట్టు అన్నాక ముల్లులు లేకుండా ఎలాగ? అందమైన గులాబీని పట్టుకోవాలంటే దాని కింద కొమ్మకి ఉండే ముల్లు గురించి జాగ్రత్తపడాలి. 'గులాబీ' రంగేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా ఇంతే. తమతో పెట్టుకుంటే 'ముల్లు' గుచ్చుకోవడం ఖాయమని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు 'ముల్లు' దెబ్బ చూపిన టిఆర్‌ఎస్‌కీ, ఆ ముల్లులు గుచ్చుకుంటున్నాయ్‌.

టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతగా ఒకానొక కాలంలో వెలిగిన నరేంద్ర, ఇప్పుడు రఘునందన్‌, మధ్యలో లెక్కలేనంతమంది ముల్లుల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ని గట్టిగా గుచ్చినవారే. మిగతావారికన్నా రఘునందన్‌ భిన్నంగా టిఆర్‌ఎస్‌ని విమర్శిస్తున్నారా? లేదా? అనేవి కాదిక్కడ ప్రాధాన్యతాంశాలు. రఘునందన్‌ విమర్శలు టిఆర్‌ఎస్‌ని ఎంత ఇబ్బంది పెట్టగలవన్నదే ప్రశ్న. టిఆర్‌ఎస్‌ అవినీతిపైనే పోరాటమంటూ న్యాయ పోరాటానికి సిద్ధమైన రఘునందన్‌, 'ఆధారాలు ఉన్నాయి' అంటుండడంతో ఈ ముల్లు దెబ్బకి టిఆర్‌ఎస్‌ విలవిల్లాడే ప్రమాదమైతే పొంచి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English