రేప‌టి నుంచే మూడో ప్ర‌పంచ యుద్ధం!

రేప‌టి నుంచే మూడో ప్ర‌పంచ యుద్ధం!

మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుందని భార‌తీయ జ్యోతిష్యుడు ప్ర‌మోద్ గౌత‌మ్ బాంబు పేల్చారు. మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభంకానుందని ఆయన తేల్చి చెప్పారు.  అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ విధ్వంసానికి దిగ‌బోతున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఈ యుద్ధ ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌పంచం మొత్తం అత‌లాకుతలం కానుంద‌ని ఆయ‌న అంటున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడంటూ గతంలో గౌతమ్ జోస్యం చెప్ప‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న అంచ‌నాల‌కు ప్రాధాన్యం ద‌క్కుతోంది.  ఇంతకుముందే అమెరికాకు చెందిన ఓ జ్యోతిష్కుడు కూడా జూన్ 14 నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.

ట్రంప్ పై గ్రహాల ప్రభావం ఆయనను ప్రపంచ యుద్ధం తీసుకొచ్చే దిశ‌గా నడిపిస్తోంద‌ని..  2017 మే 13వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ట్రంప్ పై కుజుడు తీవ్ర ప్రభావాన్ని చూపుతాడని ప్రమోద్ గౌతమ్ అంటున్నారు. తాజాగా ఉత్త‌ర కొరియా, అమెరికాల మ‌ధ్య ర‌గులుతున్న వివాదం నేప‌థ్యంలో ఈ జోష్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. రేప‌టి నుంచే ప్ర‌పంచ యుద్ధం అంటుండ‌డంతో ఇది వైర‌ల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు