కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఢిల్లీలోనే!

కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఢిల్లీలోనే!

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గురించి కొత్త చ‌ర్చ ఇది. కేసీఆర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే ఆయ‌న కుటుంబం గురించి కూడా చెప్తుంటారు క‌దా కొత్తేముంది అనుకోకండి. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఢిల్లీలో ఉంది. మంత్రిగా ఆయ‌న కుమారుడు కేటీఆర్, ఎంపీ హోదాలో జాగృతి అధ్య‌క్షురాలు క‌విత ఉండ‌టంలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు కానీ  కేసీఆర్‌ సతీమణితో పాటు తనయుడు కేటీఆర్‌, కూతురు కవిత, మనవలు, మనవరాళ్లు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అదే ట్విస్ట్‌! కంటి, దంత పరీక్షలు చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన వెంట కేసీఆర్‌ కుటుంబం వెళ్లింది.

ఆరోగ్య స‌మ‌స్య‌ల రీత్యా ఢిల్లీలో ఉన్న నేప‌థ్యంలో ఢిల్లీలో తనను కలుసుకునేందుకు కేసీఆర్‌ ఎవరికి అపాయిమెంట్‌ ఇవ్వలేదని తెలిసింది. కుటుంబ స‌భ్యులు, ఒకరిద్దరు ఎంపీలు, ముఖ్యఅధికారులతోనే చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పనులపై కేంద్ర అధికారులతో చర్చించేందుకు రాష్ట్ర అధికారులను పంపిస్తున్నారని తెలిసింది. వైద్యచికిత్స అనంతరం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు.  రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేంద్రం వద్ద పలు డిమాండ్లను అందజేసినట్టు తెలుస్తోంది. అధికారుల స్థాయిలోనే కొన్ని రాజకీయపరమైన చర్చలు సాగుతున్నట్టు స‌మాచారం.

కాగా, రైల్వే సమస్యలపై రైల్వే జీఎంతో చర్చించేందుకు గురువారం ఎంపీ కవిత హైదరాబాద్‌కు గురువారం రానున్నారు. ఆమెతో పాటు ఎంపీ వినోద్‌కుమార్‌ హాజరవుతున్నారు. ఈ సమావేశానికి మిగతా ఎంపీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కేసీఆర్‌ వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండడంతో, కుటుంబమొత్తం వేసవి విడిది కోసం వెళ్లి ఉంటుందని టీఆర్‌ఎస్‌పార్టీ వర్గాలు తెలిపాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు