మోడీని తెగ న‌వ్వించిన హీరో

మోడీని తెగ న‌వ్వించిన హీరో

ప్ర‌ధాని మోడీ న‌వ్వుతారు. కానీ.. పొదుపుగా మాత్ర‌మే. ప్ర‌త్య‌ర్థిని దెబ్బ కొట్టే స‌మ‌యంలో ఆయ‌న న‌వ్వు న‌ర్మ‌గ‌ర్భంగా ఉంటుంది. స‌మ‌యాన్ని సంద‌ర్భాన్ని చూసుకొని న‌వ్వే మోడీని.. తాజాగా బాలీవుడ్ హీరో ఒక‌రు తెగ్ న‌వ్వించేశార‌ట‌. ఆయ‌న మాట‌ల‌తో మోడీ త‌న న‌వ్వును అస్స‌లు ఆపుకోలేక‌పోయార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా స‌ద‌రు హీరోనే చెప్ప‌టం గ‌మ‌నార్హం.

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాన‌స‌పుత్రిక అయిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్రమాన్ని నేప‌థ్యంగా తీసుకొని తీసి త‌న తాజా చిత్రం టాయ్‌లెట్ - ఏక్ ప్రేమ్‌క‌థా చిత్రం గురించి చెప్పుకొచ్చారు. మోడీని క‌లిసిన సంద‌ర్భంగా త‌న తాజా చిత్రం పేరును చెప్పినంత‌నే ఆయ‌న త‌న న‌వ్వును అస్స‌లు ఆపుకోలేకోయార‌ట‌.  

స్వ‌చ్ఛ‌భార‌త్ ప్ర‌చారంలో భాగంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం గురించి చెప్పిన‌ప్పుడు ఎంతో ఆస‌క్తిగా మోడీ విన్నార‌ని అక్ష‌య్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో రాసుకున్నారు. త‌న మాట‌ల‌కు మోడీ న‌వ్విన న‌వ్వును త‌న జీవితంలో మ‌ర్చిపోలేన‌ని అక్ష‌య్ చెప్ప‌టం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు