పెళ్లి చేయించాలంటూ మోడీకి లెట‌ర్స్‌

పెళ్లి చేయించాలంటూ మోడీకి లెట‌ర్స్‌

గ‌డిచిన పాతికేళ్లే కాదు.. ఆ మాట‌కు వ‌స్తే గ‌డిచిన యాభై ఏళ్ల‌లో ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన ఏ నేత‌కు రాని హీరోయిక్ ఇమేజ్ ను న‌రేంద్ర మోడీ సొంతం చేసుకున్నార‌ని చెప్పాలి. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో మ‌న‌సుల్ని దోచుకుంటున్న ఆయ‌న‌.. అంత‌కంత‌కూ విస్త‌రిస్తున్నారు. ఒక‌ప్పుడు మోడీ అంటే భ‌య‌ప‌డిపోయిన వారే.. ఫ్యూచ‌ర్ ఇండియాకు మోడీనే మార్గ‌నిర్దేశ‌కుడు అని ఫీలైపోతున్న ప‌రిస్థితి. దేశ వ్యాప్తంగా మోడీని అభిమానించి.. ఆరాధించేవారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

త‌మ అవ‌స‌రాలు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల్ని కూడా ప్ర‌ధాని మోడీ దృష్టిని తీసుకెళుతున్న వైనం ఎక్కువ అవుతోంది. ఆయ‌న దృష్టికి వెళ్లే లేఖ‌ల్లో స‌మంజ‌స‌మైన అంశాల‌పై స్పందించే తత్త్వం ఉన్న మోడీ.. త‌మ ప్రాబ్లంను ప‌రిష్క‌రిస్తార‌న్న ఆశ‌తో ఆయ‌న‌కు లేఖ‌లు రాసే వారు ఎక్కువ‌య్యారు. అయితే.. ఇలా రాస్తున్న ఉత్త‌రాల్లో ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లే ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. తాజాగా వ‌చ్చిన ఒక లేఖ ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌చ్చింది.

చండీగ‌ఢ్‌కు చెందిన ఒక ఇంజినీరింగ్ యువ‌కుడు త‌న‌కు పెళ్లి చేయాలంటూ ప్ర‌ధానిని సాయం అడిగారు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దువుతున్న ఆ యువ‌కుడు స్థానికంగా ఉన్న ఒక ఆసుప‌త్రిలో న‌ర్సుగా ప‌ని చేస్తున్న యువ‌తిని ప్రేమించాడు. అయితే.. వారి ప్రేమ‌కు ఇరు వ‌ర్గాల పెద్ద‌లు నో చెప్పారు. దీంతో.. త‌మ పెద్ద‌ల‌తో మోడీ మాట్లాడి ఒప్పించాల‌ని స‌ద‌రు యువ‌కుడు కోరుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఇలాంటి వింత లేఖ‌లు చాలానే వ‌స్తుంటాయ‌ని.. ఇలాంటి లేఖ‌లు త‌ర‌చూ పీఎంవోకు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. పీఎంవోకు వ‌చ్చే లేఖ‌ల్లో 60 శాతం వ‌ర‌కూ ఈ త‌ర‌హాకు చెందిన‌వేన‌ని వెల్ల‌డించారు. ఇలాంటి లేఖ‌ల్ని చ‌దివిన‌ప్పుడు కోపం రాద‌ని.. న‌వ్వుకుంటామ‌ని పీఎంవో అధికారులు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English