కార్లు ఆపేసి చాక్లెట్లు ఇవ్వాల‌న్న క‌ర్నూలు ఎస్పీ

కార్లు ఆపేసి చాక్లెట్లు ఇవ్వాల‌న్న క‌ర్నూలు ఎస్పీ

స‌రికొత్త గాంధీగిరికి తెర తీశారు క‌ర్నూలు జిల్లా పోలీసులు. తాను ఎక్క‌డ ప‌ని చేస్తున్నా.. త‌న‌దైన శైలిలో ప‌ని చేసే క‌ర్నూలు ఎస్పీ ఆకే ర‌వికృష్ణ‌.. తాజాగా వినూత్న విధానానికి తెర తీశారు. వాహ‌న‌దారుల నిర్ల‌క్ష్యంతో రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోతున్న వారికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు.. వారిలో జాగ్ర‌త్త‌ను మ‌రింత పెంచేందుకు వీలుగా.. వినూత్న కార్య‌క్ర‌మానికి తెర తీశారు.

సీటు బెల్ట్ పెట్టుకోకుండా కార్లు న‌డుపుతున్న వారికి రోడ్డు నిబంధ‌న‌లు తెలియ‌జేయ‌టం.. రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ప్పుడు.. సీటు బెల్టు పెట్టుకొని ప్ర‌యాణం చేస్తే.. క‌లిగే ప్ర‌యోజ‌నం గురించి వివ‌రించ‌టంతో పాటు.. కారుడ్రైవ‌ర్ తో పాటు.. డ్రైవ‌ర్ సీటు ప‌క్క‌న ప్ర‌యాణం చేస్తున్న వారు సైతం సీటుబెల్ట్ పెట్టుకోవాల‌న్న సూచ‌న‌ను ఇవ్వాల‌ని.. ఇందుకోసం కారు ఆపి మ‌రీ చాక్లెట్ ఇచ్చి మ‌రీ ఈ విష‌యాల్ని చెప్పాల్సిందిగా క‌ర్నూలు ఎస్పీ ర‌వికృష్ణ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో.. ఆలూరు.. ఆస్ప‌రి.. ఎమ్మిగ‌నూరు ర‌హ‌దారుల్లోని పోలీసు ఉన్న‌తాధికారులు ప్ర‌తి కారును ఆపి.. డ్రైవ‌ర్ సీటు బెల్టు పెట్టుకున్నారా? లేదా? అన్న విష‌యాన్ని చూడ‌టంతో పాటు.. సీటు బెల్ట్ పెట్టుకోని వారికి పెట్టుకోవాల‌ని.. దాని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం గురించి వివ‌రిస్తూ చాక్లెట్లు ఇస్తున్నారు.

ఈ చాక్లెట్ల కౌన్సెలింగ్ వాహ‌న‌దారుల్ని విప‌రీతంగా ఆక‌ర్షించ‌టంతో పాటు.. ఈ విధానం బాగుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చాక్లెట్ల గిరి ఇప్ప‌టివ‌ర‌కూ వెయ్యి వాహ‌నాల వ‌ర‌కూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు