నిర్భ‌య పేరును మార్చేద్దామ‌ని అంటున్నారు

నిర్భ‌య పేరును మార్చేద్దామ‌ని అంటున్నారు

దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన నిర్భ‌య కేసు దోషుల‌కు విధించిన ఉరి శిక్ష‌ను మార్చ‌డానికి నిరాక‌రిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిర్భ‌య కేసులో ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం స‌మ‌ర్థిస్తూ...దోషులు ముఖేశ్‌, విన‌య్‌, ప‌వ‌న్‌, అక్ష‌య్‌ల‌కు ట్ర‌య‌ల్ కోర్టు ఉరిశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుపై ప‌లువురు స్పందించారు. నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. '' అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను, అంద‌రికీ న్యాయం జ‌రిగింది అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ఆశాదేవి అభిప్రాయాన్నివ్యక్తం చేసింది.

ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌ స్పందిస్తూ.. 'నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష నిజంగా ఓ చరిత్రాత్మక తీర్పు. అత్యాచార ఘటనల్లో మహిళలుకాదు, రేపిస్టులు సిగ్గుపడాలి. అందుకే ఇక నిర్భయను.. ఆమె తల్లి కోరినట్లే సొంత పేరైన జ్యోతి అనే పిలుద్దాం' అని విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, తీర్పు సంద‌ర్బఃగా  కోర్టు రూమ్‌లో ఉన్న లాయ‌ర్లు, నిర్భ‌య త‌ల్లిదండ్రులు చ‌ప్ప‌ట్ల‌తో ఈ తీర్పును స్వాగ‌తించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం సంతోషంగా ఉందని మేనకా గాంధీ అన్నారు. చాలా త్వరగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీం తీర్పు ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని నిర్భ‌య తండ్రి కూడా పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌తంగా తాను ఉరిశిక్ష‌కు విరుద్ద‌మ‌ని, కానీ హేయ‌మైన నేరానికి క‌ఠిన‌మైన శిక్ష త‌ప్పదు అని సీపీఎం నేత బృందా కార‌త్ అన్నారు. భార‌త దేశంలో న్యాయ‌వ్య‌వ‌స్థ కొంద‌ర్ని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్న‌ద‌ని, అందుకే తాను మ‌ర‌ణ‌శిక్ష‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.

కాగా, ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా ధ‌ర్మాస‌నంలోని ముగ్గురు న్యాయ‌మూర్తులు అభివ‌ర్ణించారు.ఈ కేసు తీవ్ర‌త‌ను చూస్తే ఉరి శిక్ష త‌ప్ప ఏ శిక్ష విధించినా త‌క్కువే అని ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా అన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్. భానుమతి, అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 27న విచారణను ముగించి తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. మ‌రోవైపు ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్‌​ దీపక్‌ మిశ్రా సహా జస్టిస్‌ అశోక్‌ భూషణలు నిర్భయ దోషులకు ఉరిశిక్షే సరైనదని తీర్పు చెప్పగా జస్టిస్‌ భానుమతి మాత్రం ఈ సమస్యను విశాల దృక్ఫథంతో ఆలోచించాలని అన్నారు. ఆడపిల్లలను, మహిళలను గౌరవించే సంస్కారాన్ని నేర్పే విద్యావ్యవస్థ అవసరమని జస్టిస్‌ భానుమతి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు