థియేట‌ర్లో పాడుప‌ని చేసిన మాజీ ఎంపీ కొడుకు

థియేట‌ర్లో పాడుప‌ని చేసిన మాజీ ఎంపీ కొడుకు

ప‌వ‌ర్ పోయినా ఆ పాడు రోగం కొంత‌మంది నేత‌ల కుటుంబాల్ని వెంటాడుతుంటుంది. ప్ర‌జ‌లు ఛీ కొట్టిన త‌ర్వాత కూడా తిన్న‌గా ఉండ‌కుండా వెధ‌వ ప‌నులు చేస్తూ.. ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న కావ‌టం మామూలే. తాజాగా అలాంటి పిచ్చ ప‌నులు చేసి అడ్డంగా బుక్ అయ్యాడో మాజీ ఎంపీ పుత్ర‌ర‌త్నం. థియేట‌ర్ లో సినిమా చూసేందుకు వ‌చ్చిన అత‌గాడు.. తాను వ‌చ్చిన ప‌ని వ‌దిలేసి.. ప‌క్క‌నున్న మ‌హిళతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు.

చెన్నైలోని తండ‌యార్ పేట‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. మాజీ ఎంపీ.. ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌లంపురి జాన్ కుమారుడు కిర‌ణ్ ప్ర‌భు. ఇత‌గాడు హైకోర్టులో లాయ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. చ‌ట్టం గురించి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. వెధ‌వ పనుల‌కు పాల్ప‌డ్డాడు. తాజాగా త‌న స్నేహితుడు భ‌ర‌తబాబుతో క‌లిసి ఓ సినిమా థియేట‌ర్ కు వెళ్లాడు.

సినిమా హాల్లో త‌న ప‌క్క‌న కూర్చున్న మ‌హిళ ప‌ట్ల ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన కిర‌ణ్ ప్ర‌భు.. అత‌గాడి స్నేహితుడి దెబ్బ‌కు బెంబేలెత్తిన స‌ద‌రు మ‌హిళ‌.. సీటులో నుంచి లేచి బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో.. ఆ మ‌హిళ ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించాడు కిర‌ణ్ ప్ర‌భు. దీంతో ఫైర్ అయిన ఆ మ‌హిళ‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి మాజీ ఎంపీ కుమారుడు.. అత‌గాడి స్నేహితుడ్ని పోలీసులు విచారించి.. అనంత‌రం అరెస్ట్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు