'నీ వికృత చేష్టలు, నటనలను అదుపులో పెట్టుకో'

'నీ వికృత చేష్టలు, నటనలను అదుపులో పెట్టుకో'

వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నోరు, భాషను వివేకా అదుపులో పెట్టుకోవాలని అన్నారు. 'నీ వికృత చేష్టలు, నటనలను అదుపులో పెట్టుకో' అంటూ హెచ్చరించారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారే సంస్కృతి ఆనం సోదరులదే అని విమర్శించారు.
   
జగన్ ను చూస్తుంటే 'ఒంగోలు గిత్త' అనే సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గుర్తొస్తోందని వివేకా ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. పగలంతా మార్కెట్ యార్డులో పెద్ద మనిషిగా చలామణి అయి, రాత్రి కాగానే మందు కొట్టి, బట్టలు విప్పేసి పడుకునే సీన్ గుర్తొస్తోందని విమర్శించారు.
   
ఈ వ్యాఖ్యలపై అనిల్ తీవ్రంగా స్పందించారు. కాగా... పెద్దగా ఎప్పుడూ వార్తల్లో కనిపించని యాదవ్ ఇటీవల దూకుడు పెంచారు. పవన్ కు వీరాభిమాని అయిన ఆయన జగన్ కూ వీరాభిమానే. జగన్ పై ఎవరు విమర్శలు చేసినా ఆయన మండిపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు