అమెరికాలో మ‌రో తెలుగోడిపై దాడి!

అమెరికాలో మ‌రో తెలుగోడిపై దాడి!

నిజ‌మే... తెలుగోళ్ల‌కు అమెరికా ఇక‌పై ఎంత‌మాత్రం సుర‌క్షితం కాద‌ని చెప్పాల్సిందే. ఇప్ప‌టికే ఉపాధి నిమిత్తం అమెరికాలో ఉంటున్న ప‌లువురు తెలుగు వాళ్లపై అక్క‌డి జాత్యంహకారులు దాడుల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో హైద‌రాబాదుకు చెందిన శ్రీనివాస్ అనే యువ ఇంజినీరు ఘ‌ట‌నా స్థ‌లిలోనే ప్రాణాలు కోల్పోగా, అత‌డి స్నేహితుడు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్ల‌నే కాకుండా మొత్తం ఎన్నారైలనే తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింద‌నే చెప్పాలి. ఈ ఘ‌ట‌న త‌ర్వాత అక్క‌డి తెలుగు సంఘాలు... ప్ర‌వాసాంధ్రులకు ప‌లు సల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నా ఫ‌లితం లేకుండా పోతోంద‌న్నవాద‌న వినిపిస్తోంది.

తాజాగా తెలుగు నేల‌కు చెందిన సందీప్ అనే యువ‌కుడిపై అమెరికాలో దాడి జ‌రిగింది. అగ్ర‌రాజ్యం రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీ న‌డిబొడ్డున జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో... తెలుగోడిని టార్గెట్ చేసిన వారు న‌ల్ల‌జాతీయుల‌ట‌. కేవ‌లం చోరీ కోస‌మే న‌ల్ల జాతీయులు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నా... స‌ద‌రు దుండ‌గుల ప్ర‌వ‌ర్త‌న‌ను గుర్తు చేసుకుని సందీప్ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న వైనం ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గ్గ‌ది. అక్క‌డ అంత మంది అమెరిక‌న్లు ఉన్నా... ఎంచుకుని మరీ సందీప్‌నే వారు టార్గెట్ చేయ‌డం వెనుక కూడా జాత్యంహ‌కారం దాగి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇక ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే...  వాషింగ్టన్ డీసీలో సందీప్ పై ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు నల్లజాతి యువకులు దాడికి పాల్పడ్డారు. సందీప్ నుంచి సెల్ ఫోన్, పర్సు, నగదును వారు దోచుకెళ్లారు. దుండగులు అటకాయించగానే, వారు దోపిడీకి వచ్చినట్టు గమనించిన సందీప్... మారు మాట్లాడకుండా తన దగ్గరున్న అన్ని వస్తువులూ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. లేకుంటే తనను హత్య చేసి ఉండేవారని ఘటన అనంతరం పోలీసులకు సందీప్ తెలిపారు. మాస్క్ లు ధరించి వచ్చిన యువకులు ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నామని వాషింగ్టన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు