పవన్ రాజకీయాలకు పనికిరాడట..

పవన్ రాజకీయాలకు పనికిరాడట..

జనసేన అధినేత పవన్ రాజకీయాలకు పనికిరారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తేల్చేశారు.  పవన్ చాలా మంచి వ్యక్తని... అలాంటి వారు రాజకీయాలకు తగరని  తాను భావిస్తున్నానని అన్నారు.  తాను పెట్టుబడులు పెట్టలేనని, ఎలక్షన్స్ లో గెలుస్తానో లేదో అన్న మాటలు ఆయన నోటి నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు ఈ తరహా దృక్పథం పనికిరాదని, బలమైన చిత్తంతో రాజకీయాల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పారు.
   
పవన్ కల్యాణ్ ఏ సమస్యపై మాట్లాడినా, అందులో కొంత అర్థం ఉంటోందని, వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సోమిరెడ్డి చెప్పారు. లోపల ఒకటి పెట్టుకుని తన స్వప్రయోజనాల కోసం జగన్ మాదిరిగా పైకి వ్యవహరించే వ్యక్తి పవన్ కాదని అన్నారు. పవన్  ప్రజల మంచిని కోరుతారనడంలో సందేహం లేదన్నారు.
   
గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించిన పవన్ ఈ సారి టీడీపీతో కలిసి పనిచేస్తారా లేదా అన్నది ఇంకా తేలనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న నెల్లూరు ప్రాంతంలో పవన్ మద్దతు అవసరమని సోమిరెడ్డి వంటివారు భావిస్తున్నారు. అంతేకాదు.... తనకు మంత్రి పదవి రాగానే సోమిరెడ్డి వెళ్లి పవన్ తల్లిని కలిసి వచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు