అమ్మ మేనకోడలిని ఆయన మనుషులు చంపేస్తామన్నారట..

అమ్మ మేనకోడలిని ఆయన మనుషులు చంపేస్తామన్నారట..

రాజకీయాల్లో పోటీతత్వం, పదవుల కోపం పాకులాట ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. హత్యారాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయమే. తమకు పోటీగా ఎవరైనా వస్తున్నారంటూ వారిని అంతమొందించడానికి కూడా వెనుకాడని వారు ఉంటారు.

ఇప్పుడు తమిళనాడులో జయలలిత మేనకోడలు దీప కూడా రాజకీయాల్లోకి రావడంతో ఆమెను హత్య చేయడానికి కొందరు ట్రై చేస్తున్నారట. ఈ సంగతి ఆమే చెబుతున్నారు. తనను హతమారుస్తామని కొంత మంది బెదిరిస్తున్నారని  జయలలిత మేనకోడలు, 'ఎంజీఆర్ అమ్మ దీపై పెరవై' పార్టీ అధ్యక్షురాలు దీప ఆరోపించారు.  పీఎంకే నేత అన్భుమణి రాందాస్ అనుచరులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె ఆరోపించారు.
    
తన మేనత్త దివంగత జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశానని.. తొలుత తనను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పలువురు పావులు కదిపారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని, వారి కుయుక్తులన్నీ అడ్డుకుని, తాను రాజకీయ రంగప్రవేశం చేశానని చెప్పారు.  వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు తనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు.
   
పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ అనుచరులు తనకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. రాందాస్ చెబుతున్న 'అవినీతి నిర్మూలన' ప్రకటనలన్నీ బోగస్ అని ఆమె చెప్పారు. మతాల పేరుతో పీఎంకే నేతలు రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను బెదిరించినా, తన మేనత్త జయలలితను ఆదర్శంగా తీసుకుని రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటానని ఆమె తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు